తొలిరోజు 90 శాతం హోం ఓటింగ్‌ పూర్తి | Sakshi
Sakshi News home page

తొలిరోజు 90 శాతం హోం ఓటింగ్‌ పూర్తి

Published Wed, May 8 2024 5:55 AM

తొలిరోజు 90 శాతం హోం ఓటింగ్‌ పూర్తి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో హోం ఓటింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. తొలి రోజు 90 శాతం పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు తెలిపారు. హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, దివ్యాంగుల ఇంటి వద్దే అధికారులు పోలింగ్‌ నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పట మట పీఅండ్‌టీ కాలనీలో హోం ఓటింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు, నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ బి.హెచ్‌.భవానీశంకర్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం 85 ఏళ్లు నిండిన వృద్ధులు, 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు హోం ఓటింగ్‌ సదుపాయం కల్పించిందన్నారు. హోం ఓటింగ్‌కు జిల్లాలో 1,052 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 651 మంది వృద్ధులు, 401 మంది దివ్యాంగులు ఉన్నారని వివరించారు. సెక్టోరల్‌ ఆఫీసర్‌, మైక్రో అబ్జర్వర్‌, పోలింగ్‌ బూత్‌ అధికారి, ఆర్మ్‌డ్‌ సిబ్బంది, వీడియోగ్రాఫర్‌తో కూడిన బృందం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి వద్దకే వెళ్లి ఓటు వేయించారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 32 బృందాలు హోం ఓటింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తున్నాయని, తొలి రోజు 90 శాతం హోం ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన పది శాతాన్ని ఈ నెల తొమ్మిదో తేదీన పూర్తి చేస్తామని తెలిపారు. పోలింగ్‌ అధికారి వి.నాగేశ్వరరావు, సహాయ పోలింగ్‌ అధికారి రత్నబాబు, ఓపీఓ బి.రవితేజ, మైక్రో అబ్జర్వర్‌ ఎ.శివతేజ, బీఎల్వో ఎం.సురేష్‌తో కూడిన బృందం పటమటలో నిర్వహించిన హోం ఓటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement