ప్రతిపక్షాలను పక్కన బెట్టి.. | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలను పక్కన బెట్టి..

Published Mon, Apr 8 2024 1:15 AM

- - Sakshi

వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు

పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న టీడీపీ,

జనసేన కార్యకర్తలు

విజయనగరం: రాష్ట్రంలో కూటమి కట్టిన తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు వారి కుటుంబాలు వైఎస్సార్‌సీపీ బాట పడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పాలనకు ఆకర్షితులమై తామంతా ప్రతిపక్షాలను విడిచిపెట్టి అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం విజయనగరం, రాజాం నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీలో చేరిన వారి వివరాలిలా ఉన్నాయి.

విజయనగరంలో..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందించిన సంక్షేమ పాలన, నగరంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి చేసిన అభివృద్ధి విధానాలకు ఆకర్షితులై పలువురు వైఎస్సార్‌సీపీలో చేరుతుండడం అభినందనీయమని వైఎస్సార్‌సీపీ జోనల్‌ ఇన్‌చార్జ్‌ కోలగట్ల తమ్మన్న శెట్టి అన్నారు. ఈ మేరకు ఆదివారం కార్పొరేషన్‌ పరిధిలోని 1వ డివిజన్‌ టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 50 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ జోనల్‌ ఇన్‌చార్జి కోలగట్ల తమ్మన్న శెట్టి, కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ శెట్టివీరవెంకట రాజేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు పార్టీ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోలగట్ల తమ్మన్న శెట్టి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా నగరంలో కనీవిని ఎరుగని రీతిలో కోలగట్ల వీరభద్ర స్వామి నేతత్వంలో అభివృద్ధి జరిగిందన్నారు. పెద్ద పల్లెటూరుగా నామకరణం ఉన్న విజయనగరాన్ని సుందరీకరణ దిశగా మార్చిన ఘనత కోలగట్ల వీరభద్రస్వామికే దక్కుతుందన్నారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆయన అండగా ఉంటారని చెప్పారు. గడిచిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి చూసి ఓటేయమని మరోసారి ప్రజలను అభ్యర్థిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ముచ్చు లయా యాదవ్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు దాసు, సీతాలు, ఎన్‌.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

దుప్పాడలో చేరిన 50 రజక కుటుంబాలు

విజయనగరం రూరల్‌: విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి వైఎస్సార్‌సీపీ యువజన నాయకుడు జి.ఈశ్వర్‌ కౌశిక్‌, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావులు కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఈశ్వర్‌కౌశిక్‌, అప్పలనాయుడులు మాట్లాడుతూ ప్రజలకు మంచి జరిగిందంటేనే ఓటేయండని అడిగే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జొన్నవలస పీఏసీఎస్‌ అధ్యక్షుడు కెల్ల త్రినాథ్‌, మండల యువజన విభాగం అధ్యక్షుడు కోరాడ రవి, వైఎస్సార్‌సీపీ నాయకులు కెల్ల సతీష్‌, కె.రాములప్పడు, బద్రి భాస్కరనాయుడు, గుడారి పైడిరాజు, చందక పరుశురాం తదితరులు పాల్గొన్నారు.

రాజాంలో మరో 50 కుటుంబాలు

రాజాం సిటీ: మండల పరిధి బొద్దాం గ్రామానికి చెందిన 50 రజక కుటుంబాలు టీడీపీ, జనసేన పార్టీలను వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఈ మేరకు ఆదివారం స్థానిక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద రజకసెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎ.వీరాస్వామి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన వేమల అప్పారావు, యండమూరి సూర్యారావు, వజ్జిపర్తి ఎరకమ్మ, కొడదాల ఆనంద్‌, యండమూరి మంగయ్య, కొమరపురి చిన్నారావు, వేమాల కన్నయ్య, కొడదాల శ్రీను, బొండాడ ఉమ తదితరులతోపాటు మరో 40 కుటుంబాల వారు వైఎస్సార్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ రాజం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ తలే రాజేష్‌ పార్టీ కండువాలువేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా వారంతా ముక్తకంఠంతో తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ టౌన్‌ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు, వైస్‌ ఎంపీపీలు నక్క వర్షిణి, యాలాల వెంకటేష్‌, నక్క మోహనరావు, సర్పంచ్‌ నక్క శ్రీను, పీఏసీఎస్‌ డైరెక్టర్‌లు ముదిలి జనార్దనరావు, నక్క ఉమామహేశ్వరరావు, అలజంగి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

రాజీపేటకు చెందిన 20 కుటుంబాలు

రాజాం: మండలంలోని రాజీపేట గ్రామానికి చెందిన పలు టీడీపీ కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఈ మేరకు ఆదివారం రాజాంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం వద్ద రాజీపేట గ్రామంలో టీడీపీకి చెందిన జి.పైడితల్లిదొర, త్రినాథ్‌, పెద్ద త్రినాఽథ్‌, నరసింహ, సీతమ్మ, రాములమ్మ, కోడూరు రూపవతి, త్రినాథ్‌, సూర్యనారాయణ, రాము, అప్పమ్మ, తవిటమ్మ, సాయి, ఎర్ర అప్పన్న, సంతోష్‌ దొర తదితరులతో పాటు మరో 20 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరగా, వారికి పార్టీ రాజాం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ తలే రాజేష్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజాం రూరల్‌ అధ్యక్షుడు లావేటి రాజగోపాలనాయుడు, యూత్‌ అధ్యక్షుడు గెడ్డాపు అప్పలనాయుడు, జెడ్పీటీసీ బండి నర్శింహులు, కంచరాం సర్పంచ్‌ గెడ్డాపు సుబ్బమ్మ, ఎంపీటీసీ రాంబాబు, మాజీ ఎంపీటీసీ సామంతుల వెంకటప్పలనాయుడు, వైస్‌ ఎంపీపీ యాలాల వెంకటేష్‌, జేసీఎస్‌ కన్వీనర్‌ కామోదుల శ్రీనివాసరావు, టౌన్‌ యూత్‌ అధ్యక్షుడు వంజరాపు విజయ్‌కుమార్‌, సామంతుల తవిటినాయుడు, రౌతు రామచంద్రినాయుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

1/3

2/3

3/3

Advertisement
Advertisement