మెరుగైన సేవలందించండి | Sakshi
Sakshi News home page

మెరుగైన సేవలందించండి

Published Thu, May 9 2024 12:45 AM

మెరుగ

కరీంనగర్‌టౌన్‌: అవసాన దశలో ఉన్న రోగులను గుర్తించి, ఆరోగ్యసేవలు అందించేందుకు పాలియేటివ్‌కేర్‌కు తరలించాలని డీఎంహెచ్‌వో సుజాత సూచించారు. బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆరోగ్యసేవలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్యకేంద్రాలు, ఆయుష్మాన్‌, ఆరోగ్య మందిర్‌ వైద్యాధికారులు సమగ్ర ప్రాథమిక ఆరోగ్యసేవలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆస్పత్రికి కూడా రాలేని రోగులకు ఇంటి వద్ద ఆలన సిబ్బందితో కూడిన మొబైల్‌వ్యాన్‌ ద్వారా ఆరోగ్యసేవలు అందించాలన్నారు. చెవి, ముక్కు, గొంతు, కంటి, పంటి సమస్యలు ఉన్న వారికి చికిత్స అందించడం లేదా జిల్లా ఆస్పత్రికి రెఫర్‌ చేయాలని సూచించారు. శిక్షకులుగా డాక్టర్లు చిన్నికృష్ణ, పృధ్వీరెడ్డి, సందీప్‌, సన జవేరియా, శిల్పారెడ్డి వ్యవహరించారు.

డాక్టర్‌ శ్రవణ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

కరీంనగర్‌టౌన్‌: జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు శ్రవణ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేసి, దాడికి పాల్పడిన వ్యక్తులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలని హెల్త్‌ కేర్‌ రిఫామ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌డీఏ) జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బండారి రాజ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం కరీంనగర్‌ లోని మంచిర్యాల చౌరస్తాలో నిరసన చేపట్టారు. డాక్టర్‌ రాజకుమార్‌ మాట్లాడుతూ డాక్టర్లపై దాడులకు పాల్పడిన వారిపై 2008 సెక్షన్‌ కింద నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనను నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌, ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. హె చ్‌ఆర్‌డీఏ ప్రతినిధులు శరణ్‌సాయి, గౌతం, శేష శైలజ, చైతన్య రెడ్డి, శ్రీలక్ష్మి, రమణాచారి, విజయ మోహన్‌ రెడ్డి, రంజిత్‌, మహేష్‌, వెంకటేశ్వర్లు, చాట్ల శ్రీధర్‌ పాల్గొన్నారు.

‘రాజ్యాంగ పరిరక్షణకు బీజేపీని ఓడించాలి’

చిగురుమామిడి: ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు కీలకమైనవని, భారత రాజ్యాంగ పరిరక్షణకు వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్ని ఏకమై బీజేపీ, మిత్రపక్షాలను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. సీపీ ఐ బలపర్చిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు పక్షాన బుధవారం చిగురుమామిడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేదవర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీని ఓడించాలన్నారు. గడిచిన ఐదేళ్లలో కరీంనగర్‌ ఎంపీగా బండి సంజయ్‌ తెచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారో వివరించాలని డిమాండ్‌ చేశారు. చిగురుమామిడి మండలంలో గత శాసనసభ ఎన్నికల్లో సీపీఐ బలపర్చిన ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అత్యధిక మెజార్టీ వచ్చిందని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారు. సిద్దిపేట సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, గోలి బాపురెడ్డి, గూడెం లక్ష్మీ పాల్గొన్నారు.

చెరువుమట్టిని సద్వినియోగం చేసుకోవాలి

కరీంనగర్‌రూరల్‌: చెరువులోని పూడికమట్టిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీవో శ్రీధర్‌ కోరారు. బుధవారం కరీంనగర్‌ మండలం చేగుర్తిలో రైతుల పొలాలకు చెరువుమట్టి తరలించే కార్యక్రమాన్ని పరిశీలించారు. చెరు వు మట్టి కోసం ఎంతమంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని, రోజుకు ఎన్ని ట్రాక్టర్ల ట్రిప్పులు మట్టి రవాణా చేస్తున్నారనే వివరాలను అడి గి తెలుసుకున్నారు. పూడికమట్టితో పొలాలు సారవంతంగా మారుతాయని, అవసరమున్న వారికి ఉచితంగా అందిస్తామని తెలిపారు. అనంతరం ఉపాధికూలీలను కలిసి తాగునీరు, నీడ సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ అడిగి తెలుసుకున్నారు. డీఆర్‌డీవో వెంట ఎంపీడీవో సంజీవరావు, ఏపీవో శోభారాణి పాల్గొన్నారు.

మెరుగైన సేవలందించండి
1/3

మెరుగైన సేవలందించండి

మెరుగైన సేవలందించండి
2/3

మెరుగైన సేవలందించండి

మెరుగైన సేవలందించండి
3/3

మెరుగైన సేవలందించండి

Advertisement
 
Advertisement
 
Advertisement