No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, Apr 19 2024 1:40 AM

- - Sakshi

కొత్తవలస: తిమ్మిని బమ్మిని చేయడం.. బమ్మిని తిమ్మిని చేయడం వంటి కనికట్టు విద్యల్లో తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబునాయుడుకి మించిన వారు ప్రపంచంలోనే ఉండరు. అధికార దర్పణంతో ప్రజాధనాన్ని లూటీ చేయడం.. తమ సామాజిక వర్గానికి మేలు చేయడంలో ఆయన మించిన వారు మరొకరు లేరు. వాస్తవాలను మరుగున పెట్టి మోసం చేయడంలో ఆయన దిట్ట. ఇదే తరహాలో ఎస్‌.కోట నియోజకవర్గ ప్రజలను నిలువునా ముంచేశారు. కొత్తవలస ప్రాంతంలో గిరిజన వర్సిటీ పేరుతో చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు కలిసి పెద్ద ఎత్తున భూ వ్యాపారాలు చేపట్టారు. తమదైన శైలిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిపారు. ఈ ప్రాంతీయుల నుంచి రూ.వందల కోట్లు కొల్లగొట్టారు. కారుచౌకగా ఉన్న స్థలాలను అధిక ధరలకు విక్రయించి మోసం చేశారు.

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాకతో వాస్తవాలు వెలుగులోకి...

2019లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గిరిజన వర్సిటీ నిర్మాణ విషయంలో కేంద్ర బృందం ఇచ్చిన నివేదిక బహిర్గతమైంది. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పును గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు గిరిజన వర్సిటీని గిరిజన ప్రాంతంలో నిర్మాణానికి చర్యలు చేపట్టింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా అచ్చ మైన రిజర్వ్‌డ్‌ పార్లమెంట్‌, అసెంబ్లీ సెగ్మెంట్‌ల ప్రాంతమైన సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో సుమారు 561.88 ఎకరాలను సేకరించింది. గిరిజన వర్సిటీకి 2023 ఆగస్టు 25న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంప్రధాన్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. గిరిజన విద్యార్థుల చదువుల ఆశయం నెరవేర్చేలా వర్సిటీ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. తొలుత రూ.60కోట్లతో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టారు.

ఇంకా ముంచేసేందుకు...

చంద్రబాబు అండ్‌ కో చేసిన రియల్‌ ఎస్టేట్‌ మోసం అందరికీ తెలిసిపోవడంతో కొనుగోలుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆర్థికంగా నష్టపోయిన వందలాది మంది టీడీపీ నాయకులను ఎక్కడికక్కడే నిలదీస్తున్నారు. దీంతో ఇటీవల ఎస్‌.కోట పర్యటనలో భాగంగా ఎల్‌.కోట మండలం సోంపురం కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో గిరిజన వర్సిటీని మళ్లీ కొత్తవలస తీసుకొస్తామంటూ నారా లోకేశ్‌ సత్యదూరపు ప్రకటన చేశారు. దీనికి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వంతపాడారు. అంటే... రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఏ స్థాయిలో జరిపారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొనుగోలు చేసేవారు ఉంటే ముంచేసేందుకు లోకేశ్‌తో పాటు లలితకుమారి సిద్ధంగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2014లోనే కేంద్రం మంజూరు

చేసినా తూతూ మంత్రంగా పనులు

సొంత సామాజిక వర్గ రియల్‌ ఎస్టేట్‌ కోసం వర్సిటీ ఆశయానికి గండి

గిరిజన ప్రాంతానికి చేరువగా

ఉండాల్సిన ప్రాంగణాన్ని విశాఖకు

చేరువలో ఏర్పాటు

రూ.5 కోట్ల ఖర్చుతో ప్రహరీ పనులు బినామీలకు అప్పగింత

అమరావతి తరహాలో భూ పందేరం

వర్సిటీ పేరుతో సొమ్ముచేసుకున్న

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన

తర్వాతే వర్సిటీ ఆశయానికి

అనుగుణంగా చర్యలు

సాలూరు నియోజకవర్గంలో 561.88

ఎకరాల భూమి సేకరణ

రైతులకు పరిహారం చెల్లించిన తర్వాత ముఖ్యంత్రి

వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి

శంకుస్థాపన

రూ.60కోట్లతో మౌలిక వసతులు

1/2

2/2

Advertisement
Advertisement