
హమాస్ మిలిటెంట్లను అంతం చేసేవరకు గాజాలో దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ పేర్కొంటోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. ఇజ్రాయెల్ వార్ కెబినెట్ మంత్రి బెన్నీ గాంట్జ్ మీడియాతో మాట్లాడుతూ.. కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు.
హమాస్‌తో యుద్ధం ముగిసిన అనంతరం పాలస్తీనాను ఎవరు పాలిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దాని కోసం ప్రధాన మంత్రి నెతన్యాహుకు ఇజ్రాయెల్ రెసిలెన్స్ పార్టీ చెందిన బెన్నీ గాంట్జ్.. జూన్ 8 వరకు యుద్ధం అనంతరం చేపట్టే 6 అంశాలతో కూడిన ప్రణాళిక రూపొందించాలని అల్టిమెటం జారీ చేశారు. అప్పటివరకు నెతన్యాహు ఏం తేల్చకపోతే.. రాజీనామా చేయటంతో పాటు, ప్రస్తుత ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు.
‘‘ఇజ్రాయల్ సైనికులు యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుంటే.. యుద్ధానికి సైన్యాన్ని పంపిన కొందరు మాత్రం పిరికితనంతో, చాలా బాధ్యతరాహిత్యంగా వ్యవస్తున్నారు’’ అని ప్రరోక్షంగా ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై విమర్శలు చేశారు.
ఇక.. ఆక్టోబర్ 7 నుంచి హమాస్ మిలిటెంట్లు దాడి చేసి ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా తీసుకువెళ్లినందుకు ప్రతీకారంగా గాజాపై విరుచుకుపడుతన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటివరకు 34,900 మంది పాలస్తీయన్లు ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment