బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక: వెల్లంపల్లి | Sakshi
Sakshi News home page

బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక: వెల్లంపల్లి

Published Sat, Apr 27 2024 5:15 PM

Former Minister Vellampalli Srinivas Fires On Bonda Uma

సాక్షి, విజయవాడ: బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక అని.. ఆయన మోసాలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. 2014లో బోండా ఉమా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అధికారులను తప్పుదారి పట్టించారని దుయ్యబట్టారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బోండాపై మేం మూడు ఫిర్యాదులు చేశాం. సింగ్ నగర్ పార్టీ ఆఫీస్‌లో ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్‌లోనే ఓట్లు ఉండాలి. మా ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోలేదు. 2014లో అఫిడవిట్‌లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారు. 2019 అఫిడవిట్‌లోనూ తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్‌నే పెట్టారు. 2024 అఫిడవిట్‌లో సింగ్‌నగర్ పార్టీ ఆఫీస్‌ను ఇల్లుగా చూపించాడు. ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారు. పార్టీ ఆఫీస్‌లో ఆయన ఎలా నివాసముంటున్నారు?. పార్టీ ఆఫీస్‌లో ఓట్లు ఎలా నమోదు చేస్తారు?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.

‘‘గతంలో వైఎస్సార్‌సీపీ నేతల ఓట్లను బోండా బలవంతంగా రద్దు చేయించాడు. అదే రూల్ ఇప్పుడు బోండాకు ఎందుకు వర్తించదు. టీడీపీ పార్టీ ఆఫీస్‌లోనే బోండా కుటుంబానికి చెందిన ఐదు ఓట్లు ఉన్నాయి. బోండా ఉమా అభ్యర్ధిగా పోటీ చేసేందుకు అనర్హుడు. మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. నేను ఇక్కడితో ఆగను. బోండాపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తా. బోండా తన కుమారుడితో సంబంధం లేదని చెప్పి ఓటు ఇక్కడే చూపించారు. ఒక కుమారుడు ఇతర దేశంలో ఉంటారని చెప్పి.. ఓటు ఇక్కడే చూపించాడు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బోండా తప్పుడు సమాచారం ఇచ్చాడు. తప్పుడు డాక్యుమెంట్‌తో ఓటు చూపించాడు. బోండా ఉమా ఓటు రద్దుచేయించే వరకూ పోరాడతా’’ అని వెల్లంపల్లి తేల్చి చెప్పారు.

‘‘నేను పక్క నియోజకవర్గం నుంచి వచ్చానంటున్నాడు. బోండా పక్క నియోజకవర్గం నుంచి రాలేదా?. ఎమ్మెల్యేగా గెలిచాక.. నేను సెంట్రల్ నియోజకవర్గంలోనే నివాసముంటా.. బోండా ఉమా... అతని సతీమణి.. ఇద్దరు కుమారులు.. కోడలు ఓట్లు చెల్లవు. పార్టీ కార్యాలయాన్ని ఇల్లుగా చూపించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎవరైనా కాపురాలు చేస్తారా?. బోండా ఉమా చెల్లదు.. కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బోండాను అనర్హుడిగా ప్రకటించే వరకూ పోరాడతా. బోండా ఉమా అధికారులను బెదిరిస్తున్నాడు. బీజేపీతో పొత్తులో ఉన్నామని బెదిరిస్తున్నాడు.

2 కోట్ల 54 లక్షల 97వేల రూపాయలు ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాడు. బోండా ఉమా ఆర్థిక నేరస్తుడు. బోండా ఉమా వంటి ఆర్ధిక నేరస్తుడికి ఓటేయొద్దు. 2019లో పెండింగ్‌లో ఉన్నవి.. 2014లో ఉన్న కేసులు 2024 అఫిడవిట్‌లో పొందుపరచలేదు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. బోండా ఉమాపై ఉన్న కేసులపై తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. వేరే పార్టీలను ప్రచారం చేయనీయకుండా చేస్తున్నారు. వేరే పార్టీలకు అవకాశం లేకుండా పర్మిషన్లు తీసుకుని తిరగకుండా చేస్తున్నారు. మా ప్రచారాన్ని అడ్డుకోవడానికి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడు’’ అంటూ వెల్లంపల్లి ధ్వజమెత్తారు.

‘‘మా హక్కులకు బోండా ఉమా భంగం కలిగిస్తున్నాడు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. బోండా ఉమా దిక్కుమాలిన రాజకీయం మానుకోవాలి. ఓటు అడగనోడివి నీరెందుకు బోండా ఉమా అనుమతులు. ఓటమి భయంతోనే బోండా నీచ రాజకీయాలు చేస్తున్నాడు. బోండాను కచ్చితంగా ఓడించి తీరుతాం.. బుద్ధిచెబుతా’’ అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ హెచ్చరించారు.

Advertisement
Advertisement