సిరుల వరి | Sakshi
Sakshi News home page

సిరుల వరి

Published Thu, Feb 8 2024 5:52 AM

సింగూరు కాలువ - Sakshi

సింగూరు నీటితో ఏటా రెండు పంటలు
 

పుల్‌కల్‌(అందోల్‌): సింగూరు ప్రాజెక్టు సాగు నీటితో రైతులు సిరులు పండిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితమే కాలువల నిర్మాణం పూర్తయి నిరంతరాయంగా నీరు సరఫరా అవుతుండటంతో సాగు విస్తీర్ణాన్ని పెంచారు. పంట ఉత్పత్తులు కూడా పెరగడంతో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఒకప్పుడు కరెంట్‌ కోసం, వర్షాల కోసం ఎదురు చూసిన వారు కాలువ నీటితో పంటలు పండిస్తున్నారు.

సింగూరు కాలువల ద్వారా ఎడమ కాలువ నుంచి సాగు నీరు సరఫరా అవుతోంది. పుల్‌కల్‌, చౌటకూరు, అందోల్‌ మండలాల రైతులు ఏటా రెండు పంటలను పండిస్తున్నారు. కాలువ పరిధిలోని చెరువులను కూడా నీటితో నింపుతున్నారు. దీంతో ఆయకట్టు రైతులు 40 వేల ఎకరాల్లో వరి చేస్తున్నారు. సంవృద్ధిగా నీరు లభిస్తుండటంతో పాటు ఉత్తర భారత దేశం నుంచి కూలీలు ఇక్కడికి వస్తున్నారు. దీంతో నాట్లు వేసే విషయమై కొరత ఉండదు. రసాయనాలను డ్రోన్‌ల సహాయంతో పిచికారీ, పంట పూర్తయిన తర్వాత వరి కోత యంత్రాలతో సులువుగా నూర్పిడి చేస్తున్నారు. అనంతరం ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటుంది. నగదును రైతుల ఖాతాలోనే సకాలంలో జమ చేస్తుండటంతో వరి సాగుకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాగా ఆయకట్టు పరిధిలో కొత్తగా రైసు మిల్లులు సైతం వెలిశాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement