నాగార్జున హిట్ మూవీ నా సామిరంగతో టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఆషికా రంగనాథ్. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తొలుత ‘అమిగోస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆమె గ్లామర్‌కు ఫిదా అయిన యూత్ సోషల్‌మీడియాలో ఆమెను భారీగానే అనుసరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ బ్యూటీ కూడా తన గ్లామర్ ఫోటోలతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో అషికా రంగనాథ్ ఛాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఇప్పుడీ అమ్మడు మరో అవకాశం అందుకుంది. సిద్ధార్థ్ హీరోగా ఎన్.రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో అషికాకు ఛాన్స్ దక్కింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా ద్వారా ఫ్యాన్స్‌కు తెలిపింది. ఈ సినిమాకు 'మిస్ యు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ఆమె ఫస్ట్‌లుక్ కూడా షేర్ చేసింది. తెలుగులో మూడో సినిమానే మెగాస్టార్‌తో చేయనుండటంతో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తే ఇప్పుడు సిద్ధార్థ్‌తో సినిమా ఛాన్స్ దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment