‘భగీరథ’ నీటిని పొలాలకు ఉపయోగించొద్దు | Sakshi
Sakshi News home page

‘భగీరథ’ నీటిని పొలాలకు ఉపయోగించొద్దు

Published Tue, Apr 16 2024 6:45 AM

అవార్డు అందుకుంటున్న రమేశ్‌  - Sakshi

కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని తపాస్‌పల్లి గ్రామాన్ని మిషన్‌భగీరథ ఈఈ శ్రీనివాస్‌, డీఈ వేణుగోపాల్‌, ఏఈ దినేశ్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. ఆదివారం గ్రామానికి చెందిన కొంత మంది రైతులు మిషన్‌ భగీరథ ఏయిర్‌ వాల్వ్‌ ఓపెన్‌చేసి తమ పొలాలకు నీటిని మళ్లిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు గ్రామానికి వచ్చి ఏయిర్‌వాల్వ్‌ను పరిశీలించారు. అనంతరం గ్రామంలో మిషన్‌భగీరథ నీరు గ్రామస్తులకు ఏవిధంగా అందుతుందో అడిగి తెలుసుకున్నారు. భగీరథ నీటిని పొలాలకు ఉపయోగించకూడదని, ఎవరైనా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీపీఓ దేవకి దేవి, ఆర్‌ఐ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లు అందజేత

సిద్దిపేటకమాన్‌: పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లను ఆధునిక టెక్నాలజీ సాయంతో గుర్తించి వన్‌టౌన్‌ పోలీసులు బాధితులకు అప్పగించారు. సీఐ లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఆరుగురు వివిధ కారణాలతో తమ సెల్‌ఫోన్‌లను పొగొట్టుకున్నారు. అనంతరం వారి ఫిర్యాదుపై పోలీసులు సీఈఐఆర్‌ యాప్‌లో వివరాలను నమోదుచేసి వాటిని బ్లాక్‌ చేయించారు. తర్వాత వాటిని గుర్తించి సోమవారం స్థానిక స్టేషన్‌లో బాధితులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.

అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన

సిద్దిపేటకమాన్‌: అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా స్థానిక మోడ్రన్‌ బస్టాండ్‌, ఆర్టీసీ డిపోలో ఫైర్‌ సిబ్బంది ప్రయాణికులకు సోమవారం అవగాహన కల్పించారు. సిద్దిపేట ఇన్‌చార్జి ఫైర్‌ ఆఫీసర్‌ కె.నరేశ్‌ మాట్లాడుతూ వేసవిలో అజాగ్రత్తగా పొగతాగడం వల్ల అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయన్నారు. ప్రమాదం జరిగినపుడు నివారణ చర్యలు చేపడుతూనే ఫైర్‌ స్టేషన్‌ 87126 99250, లేదా డయల్‌ 101కు ఫోన్‌చేసి సమాచారం తెలపాలని సూచించారు. కార్యక్రమంలో ఫైర్‌ సిబ్బంది నరేశ్‌, రవి, యాదగిరి, సంపత్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్‌కు

జాతీయ పురస్కారం

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మండలంలోని చౌటపల్లి మాజీ సర్పంచ్‌ గద్దల రమేశ్‌కు జాతీయస్థాయి పురస్కారం లభించింది. సోమ వారం ఆయన మాట్లాడుతూ ఉగాది క్రోదినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని జాతీ య తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌ త్యాగరాయ గానసభ వెంటకదీక్షితులు కళావేదికలో ఈ పురస్కారాన్ని అందుకున్నానన్నారు. గ్రామాభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత, ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం లాంటి సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ఇచ్చినట్లు చెప్పారు.

స్వచ్ఛ దుబ్బాకే లక్ష్యం

మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌

దుబ్బాకటౌన్‌: స్వచ్ఛ దుబ్బాకే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీలో డైన్రేజీలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాకను స్వచ్ఛతలో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంచడానికి ప్రజలు సహకరించాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, మురుగు కాలువల్లో చెత్తను పారవేస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు.

భగీరథ నీటి సరఫరాను పరిశీలిస్తున్న అధికారులు
1/3

భగీరథ నీటి సరఫరాను పరిశీలిస్తున్న అధికారులు

ప్రయాణిలకు అవగాహన కల్పిస్తున్న ఫైర్‌ సిబ్బంది
2/3

ప్రయాణిలకు అవగాహన కల్పిస్తున్న ఫైర్‌ సిబ్బంది

డ్రైనేజీలను శుభ్రం చేయిస్తున్న రమేశ్‌ కుమార్‌
3/3

డ్రైనేజీలను శుభ్రం చేయిస్తున్న రమేశ్‌ కుమార్‌

Advertisement
Advertisement