ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి | Today Telugu Horoscope On May 8th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి

Published Wed, May 8 2024 6:38 AM

Daily Horoscope: Rasi Phalalu On 08-05-2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: అమావాస్య ఉ.8.55 వరకు, తదుపరి వైశాఖ శు.పాడ్యమి, నక్షత్రం: భరణి ప.2.02 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.1.34 నుండి 3.05 వరకు, దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.20 వరకు, అమృత ఘడియలు: ఉ.9.28 నుండి 10.44 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.17. 

మేషం: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: బంధువర్గంతో తగాదాలు. వృథా ఖర్చులు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

మిథునం: పనులు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక ప్రగతి. రుణబాధలు తొలగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. దైవదర్శనాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

కర్కాటకం: శుభవర్తమానాలు  అందుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. వ్యాపార విస్తరణయత్నాలు .. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

సింహం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. ఆస్తి తగాదాలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు.

కన్య: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణయత్నాలు. ఇంటాబయటా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు. అనారోగ్యం.

తుల: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. కొత్త పనులకు శ్రీకారం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సేవలకు గుర్తింపు.

వృశ్చికం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆస్తిలాభం. కొన్ని నిర్ణయాలు  తీసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కీలక బాధ్యతలు.

ధనుస్సు: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు.

మకరం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆ«ధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు.

కుంభం: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు ఉత్సాహంగా  సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహంగా గడుస్తుంది.

మీనం: వ్యయప్రయాసలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు చిక్కులు.

 
Advertisement
 
Advertisement