Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి |Today Telugu Horoscope On May 6th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి

Published Mon, May 6 2024 6:20 AM

Daily Horoscope Rasi Phalalu May 06-05-2024 Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.త్రయోదశి ప.1.13 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: రేవతి సా.4.40 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ప.12.22 నుండి 1.11 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: ప.2.25 నుండి 3.56 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.36, సూర్యాస్తమయం: 6.17. 

మేషం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృషభం: కుటుంబంలో ఆనందంగా గడుపుతారు.  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం: రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలోగౌరవం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో హోదాలు.

కర్కాటకం: కొత్తగా చేపట్టిన పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు.

సింహం: బంధువిరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఉద్యోగయత్నాలు ఫలించవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి అవాంతరాలు.

కన్య: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

తుల: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఇంటర్వ్యూలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.

వృశ్చికం: దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. పనుల్లో ఆటంకాలు. సోదరులు, మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

ధనుస్సు: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్పదు. నిర్ణయాలలో మార్పులు. సోదరులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో వివాదాలు.

మకరం: వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. పనుల్లో తొందరపాటు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో మరిన్ని ఇబ్బందులు. ఉద్యోగాలలో ఉన్నతా«ధికారుల నుంచి ఒత్తిడులు.

మీనం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
 

Advertisement
 
Advertisement