Horoscope Today: ఈ రాశివారికి ఆకస్మిక ప్రయాణాలు.. ఆర్థిక ఇబ్బందులు | Today Telugu Horoscope On May 7th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశివారికి ఆకస్మిక ప్రయాణాలు.. ఆర్థిక ఇబ్బందులు

Published Tue, May 7 2024 6:19 AM

Daily Horocope Rasi Phalalu Mya 07-05-2024 Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.చతుర్దశి ఉ.10.58 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: అశ్వని ప.3.14 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ఉ.11.28 నుండి 12,57 వరకు, తిరిగి రా.12.23 నుండి 1.54 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.57వరకు, తదుపరి రా.10.57 నుండి 11.33 వరకు, అమృతఘడియలు: ఉ.8.26 నుండి 9.54 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.17. 

మేషం: ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

వృషభం: శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం: ఇంటర్వ్యూలు అందుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కర్కాటకం: మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

సింహం: చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కన్య: గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాMీ లు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగావకాశాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: కుటుంబసమస్యలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. సోదరుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. మిత్రులు, సోదరుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

కుంభం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

మీనం: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.నూతన పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.
 

 
Advertisement
 
Advertisement