కలెక్టర్‌ సారూ.. థ్యాంక్స్‌ | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ సారూ.. థ్యాంక్స్‌

Published Thu, Apr 18 2024 2:00 PM

కాంగ్రెస్‌లోకి చేరిన వారితో నర్సారెడ్డి  - Sakshi

స్పెషల్‌ గ్రాంట్‌తో మల్లన్నగుట్టతండా వాసుల తాగునీటి సమస్యకు పరిష్కారం

మద్దూరు(హుస్నాబాద్‌): కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యకు కలెక్టర్‌ నిధుల ద్వారా పరిష్కారం లభించింది. వివరాలిలా.. దూళ్మిట్ట మండలం కొండాపూర్‌ పంచాయతీకి చెందిన మల్లన్న గుట్ట తండా ప్రజలు కొద్ది నెలలుగా తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎంపీటీసీ ఇస్లావత్‌ నమ్ముకు సమస్య వివరించగా ఆయన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన అధికారులు కలెక్టర్‌ స్పెషల్‌ గ్రాంట్‌ నిధుల నుంచి తండాకు తాగునీటి లైన్‌కు కావాల్సిన పైపులు సమకూర్చారు. బుధవారం పైప్‌ లైన్‌ పనులను మల్లన్న గుట్ట తండాలో ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ మనుచౌదరి, ఎంపీటీసీ ఇస్లావ త్‌ నమ్ము, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ లక్ష్మీ, పంచాయ తీ సెక్రటరీ అశోక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం

డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): గజ్వేల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రానుందని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వట్టిపల్లికి చెందిన బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు 30 మంది కాంగ్రెస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నర్సారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు మంచి రోజులు రాబోతున్నాయని తెలిపారు. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ కనుమరుగు కావడం ఖాయమన్నారు. పేదల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ రజితరాజిరెడ్డి, ఉపసర్పంచ్‌ మునీర్‌, నాయకులు తిరుపతిరెడ్డి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ మహేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులు

అన్నింట్లో రాణించాలి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): విద్యార్థులు చదువుతో పాటుగా సాంస్కృతిక, క్రీడా రంగాల్లో రాణించాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు జగ్గు మల్లారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ టెక్నో స్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, చదువులో పై తరగతులకు వెళుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు కష్టపడి, ఇష్టపడి చదివి తల్లిదండ్రులకు, గురువులకు, చదువుకున్న పాఠశాలకు, కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పైప్‌ లైన్‌ పనులు ప్రారంభిస్తున్న సిబ్బంది
1/1

పైప్‌ లైన్‌ పనులు ప్రారంభిస్తున్న సిబ్బంది

Advertisement
Advertisement