పరిహారం ఇప్పించాలని రైతుల ధర్నా | Sakshi
Sakshi News home page

పరిహారం ఇప్పించాలని రైతుల ధర్నా

Published Wed, May 8 2024 11:45 PM

పరిహారం ఇప్పించాలని రైతుల ధర్నా

వేమనపల్లి: వడగళ్ల వానకు పంట నష్టపోయామని, పరిహారం ఇచ్చి ఆదుకోవాలని మండలంలోని రైతులు బుధవారం స్థానిక తహసీల్దా ర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వేమనపల్లి, రాజారాం, మంగెనపల్లి, జాజులపేట, సుంపుటం గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి పైరు నేలకొరిగిందని, వడగళ్ల తాకిడికి గింజ లేకుండా రాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల వరకు పొలాలు ఆరే పరిస్థితి లేదని, గ్రామాల వారీగా పంట నష్టం అంచనా వేయాలని అన్నారు. అ నంతరం తహసీల్దార్‌ కార్యాలయ రికార్డు అసిస్టెంట్‌ హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కుర్రు వెంకటేశం, రైతులు గొండె రవి, అశోక్‌, శ్రీనివాస్‌ రెడ్డి, శేఖర్‌రెడ్డి, కొండ బాపు, తలండి సురేష్‌, భీరయ్య, విలాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement