ICC: బంగ్లాదేశ్‌ క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం.. ఐసీసీ ప్రకటన | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం.. ఐసీసీ ప్రకటన విడుదల

Published Tue, Jan 16 2024 7:27 PM

ICC Bans Bangladesh Cricketer Nasir Hossain For 2 Years Know Why - Sakshi

Bangladesh all-rounder banned from all cricket: బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ నాసిర్‌ హొసేన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి భారీ షాకిచ్చింది. రెండేళ్ల పాటు క్రికెట్‌ ఆడకుండా అతడిపై నిషేధం విధించింది. ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకుగానూ ఈ నిర్ణయం తీసుకుంది.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు
ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి మంగళవారం ప్రకటన విడుదల చేసింది. అబుదాబి టీ10 లీగ్‌లో 2020-21 సీజన్‌కు గానూ పుణె డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన నాసిర్‌ హుసేన్‌.. మరో ఏడుగురితో కలిసి మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం సెప్టెంబరు, 2023లో అభియోగాలు నమోదు చేసింది. 

తప్పు చేశాడని తేలింది
ఈ అంశంపై దృష్టి సారించిన ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణ చేపట్టగా నాసిర్‌ హుసేన్‌ తప్పు చేసినట్లు తేలింది. ఖరీదైన ఐఫోన్‌ 12ను బహుమతిగా పొందడం సహా ఫిక్సింగ్‌కు సంబంధించి ఆ ఫోన్‌లో బుకీలతో మాట్లాడటం.. ఈ విషయాల గురించి ఏ దశలోనూ అవినీతి నిరోధక విభాగంతో సంప్రదించకపోవడం, విచారణలో సహకరించకపోవడం అతడిపై వేటుకు కారణమైంది.

మళ్లీ అపుడే రీఎంట్రీ సాధ్యం
కాగా తాజా నిషేధం నేపథ్యంలో.. మళ్లీ 2025 ఏప్రిల్‌ 7 తర్వాతనే నాసిర్‌ హుసేన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే అవకాశం ఉంటుంది. ఇక స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అయిన నాసిర్‌ హుసేన్‌ బంగ్లాదేశ్‌ తరఫున 19 టెస్టులు, 65 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. ఆఖరిసారిగా 2018లో బంగ్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు ఈ 32 ఏళ్ల ఆల్‌రౌండర్‌.

చదవండి: అతడు ఎవరినీ కాపీ కొట్టడం లేదు.. హార్దిక్‌ తిరిగొస్తే తలనొప్పి: టీమిండియా దిగ్గజం

Advertisement
 
Advertisement
 
Advertisement