టీమిండియాతో మూడో వన్డే.. భారీ స్కోర్‌ సాధించిన ఆసీస్‌ | INDW VS AUSW 3rd ODI: Australia Scored 338 Runs For Loss Of 7 Wickets - Sakshi
Sakshi News home page

టీమిండియాతో మూడో వన్డే.. భారీ స్కోర్‌ సాధించిన ఆసీస్‌

Published Tue, Jan 2 2024 5:33 PM

INDW VS AUSW 3rd ODI: Australia Scored 338 Runs For Loss Of 7 Wickets - Sakshi

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఇవాళ (జనవరి 2) జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. ఓపెనర్‌ ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (119) సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టాని​కి 338 పరుగులు చేసింది. లిచ్‌ఫీల్డ్‌కు మరో ఓపెనర్‌ అలైసా హీలీ (82) కూడా తోడవ్వడంతో ఆసీస్‌ భారీ స్కోర్‌ చేసింది.

ఆఖర్లో ఆష్లే గార్డ్‌నర్‌ (30), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (23), అలానా కింగ్‌ (26 నాటౌట్‌), జార్జియా వేర్హమ్‌ (11 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌ 3 వికెట్లతో రాణించగా.. అమన్‌జోత్‌ కౌర్‌ 2, పూజా వస్త్రాకర్‌, దీప్తి శర్మ తలో వికెట్‌ వికెట్‌ పడగొట్టారు. కాగా, తొలి రెండు వన్డేల్లో గెలుపొందిన ఆసీస్‌ ఇదివరకే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

ఈ సిరీస్‌కు ముందు జరిగిన ఏకైక టెస్ట్‌లో మాత్రం టీమిండియా ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. వన్డే సిరీస్‌ ఆనంతరం​ జనవరి 5, 7, 9 తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ నవీ ముంబై వేదికగా జరుగనున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement