Sakshi News home page

IPL 2024 RCB VS PBKS: ధోని రికార్డును సమం చేసిన కోహ్లి

Published Tue, Mar 26 2024 10:13 AM

IPL 2024 RCB VS PBKS: Virat Kohli Equals Dhoni In Most IPL Man Of The Match Earned - Sakshi

పంజాబ్‌ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో "ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌"గా నిలిచిన ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి.. ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండిన సీఎస్‌కే మాజీ కెప్టెన్‌ ఎం​ఎస్‌ ధోని రికార్డును కోహ్లి సమం చేశాడు. ఐపీఎల్‌లో ధోని ఇప్పటివరకు 17 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకోగా.. నిన్నటి మ్యాచ్‌తో కోహ్లి ఆ సంఖ్యను (17) సమం చేశాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్‌ మాజీ సారధి రోహిత్‌ శర్మ టాప్‌లో ఉన్నాడు. రోహిత్‌ ఖాతాలో 19 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు ఉన్నాయి. 

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. శిఖర్‌ ధవన్‌ (37 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఆర్సీబీ మరో 4 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో శశాంక్‌ సింగ్‌ (8 బంతుల్లో 21 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్‌ (25), సామ్‌ కర్రన్‌ (23), జితేశ్‌ శర్మ (27) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. యశ్‌ దయాల్‌, అల్జరీ జోసఫ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. విరాట్ హాఫ్‌ సెంచరీతో (49 బంతుల్లో 77; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. దినేశ్‌ కార్తీక్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (10 బంతుల్లో 28 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి మ్యాచ్‌ను ఫినిష్‌ చేయగా.. అతనికి మహిపాల్‌ లోమ్రార్‌ (8 బంతుల్లో 17 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) సహకరించాడు. ఆర్సీబీ బ్యాటర్లు డుప్లెసిస్‌ (3), గ్రీన్‌ (3), మ్యాక్స్‌వెల్‌ (3), పాటిదార్‌ (18), అనూజ్‌ రావత్‌ (11) నిరాశపరిచారు. పంజాబ్‌ బౌలర్లలో హర్ప్రీత్‌ బ్రార్‌ (4-0-13-2), రబాడ (4-0-23-2) అద్భుతంగా బౌలింగ్‌ చేసినప్పటికీ మిగతా బౌలర్ల నుంచి వారికి సహకారం లభించలేదు.

Advertisement

What’s your opinion

Advertisement