Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది | Weekly Horoscope Telugu 28-04-2024 To 01-05-2024 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది

Published Sun, Apr 28 2024 6:49 AM | Last Updated on Sun, Apr 28 2024 6:49 AM

Weekly Horoscope Telugu 28-04-2024 To 01-05-2024

మేషం
మరింత ఉత్సాహవంతంగా ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. మిత్రులతో కలహాలు. నీలం, ఆకుపచ్చరంగులు. దేవీస్తుతి మంచిది.

వృషభం
ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా ముగిస్తారు. సోదరులు, మిత్రులు మీకు వెన్నంటి ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభాలు కలుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వివాహాది వేడుకల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ముఖ్యమైన వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కళారంగం వారి సేవలకు గుర్తింపుతో పాటు, సన్మానాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, పసుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.

మిథునం
రుణవిముక్తికి చేసే యత్నాలు సఫలం. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా పూర్తి చేయడంలో మిత్రులు సహకరిస్తారు. వేడుకల నిర్వహణలో భాగస్వాములు కాగలరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాబడతారు. పెద్దల సలహాలు పాటిస్తూ ముందుకు సాగుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయటా మరింత ప్రోత్సాహం. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో హోదాలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వైరం. పసుపు, ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం
పట్టింది బంగారమే అన్న విధంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలదు. ఆర్థికంగా మరింత ప్రగతి ఉంటుంది. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. మీ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లా¿¶ సాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు అందుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు.  విష్ణుధ్యానం చేయండి.

సింహం
మొదట్లో ఉన్న ఇబ్బందులు, సమస్యలు క్రమేపీ తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగుల కృషి సఫలమవుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌర విస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది.  గులాబీ, నేరేడు రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.

కన్య
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. సన్నిహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులను సైతం ఆదరిస్తారు. నిరుద్యోగులు పడిన శ్రమ ఫలిస్తుంది. మీ నిర్ణయాలపై సానుకూలత ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. మిత్రులతో మాటపట్టింపులు. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

తుల
మీ యుక్తి, ప్రతిభను నిరూపించుకునేందుకు తగిన సమయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. బంధువుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఊహించని అవార్డులు, సన్మానాలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, ఆకుపచ్చ రంగులు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు కలసిరాక డీలా పడతారు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఇంటి బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి  చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇతర వేడుకల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. బంధువులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు ఎదురుకావచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, లేత ఎరుపు రంగులు.  అన్నపూర్ణాష్టకం పఠించండి.

ధనుస్సు
పట్టుదలతో ముందుకు సాగండి, విజయాలు చేకూరతాయి. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో విభేదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో కదలికలు ఉంటాయి. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. మీసహాయం కోసం మిత్రులు ఎదురుచూస్తుంటారు. వ్యాపారాలు గతం కంటే అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మీహోదాలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గాదేవిని ఆరాధించండి.

మకరం
సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ప్రముఖులు పరిచయమవుతారు. మీ శక్తిసామర్థ్యాలను కుటుంబసభ్యులు గుర్తిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. మద్యమధ్యలో కొంత అనారోగ్యం కలిగినా ఉపశమనం పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహం. వారం ప్రారంభంలో కుటుంబసమస్యలు. పనుల్లో ప్రతిబంధకాలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం
ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఆత్మీయులు, బంధువులతో మనస్సులోని భావాలను పంచుకుంటారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు మరింత అనుకూలస్థితి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వి¿ే దాలు. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

మీనం
నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. కుటుంబంలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. అనుకున్న మేరకు డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు ఆందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తుల వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహిస్తారు. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. నీలం, నేరేడు రంగులు.  శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement