సమంత రుతు ప్రభు.. ఈ పేరు చెప్పగానే సినిమాలు, కాంట్రవర్సీలు, విమర్శలు, ట్రోల్స్ ఇలా చాలా గుర్తొస్తాయి. ఎందుకంటే ఈమె జీవితం సినిమాని మించిపోయేలా ఉంటుంది. హ్యాపీ మూమెంట్స్‌తో పాటు ట్రాజెడీ అనిపించే సంగతులు చాలానే వినిపిస్తాయి. వీటి గురించి కొందరికి తెలిస్తే మరికొందరికి తెలియదు. ఇప్పుడు సమంత 37వ పుట్టినరోజు సందర్భంగా మరోసారి వాటిని అలా గుర్తుచేసుకుందాం.
తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగిన సమంత.. అక్కడే చదువుకుంది. డిగ్రీ చివర్లో ఉండగానే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. అయితే సినిమాల్లోకి రాకముందు పాకెట్ మనీ కోసం పార్టీలు, ఈవెంట్స్‌లో వెల్‌కమ్ గర్ల్‌గా పనిచేసింది. అలానే 'ఏ మాయ చేశావె'.. ఈమె తొలి సినిమా అని చాలామంది అనుకుంటారు. కానీ అంతకంటే ముందే తమిళంలో 'మాస్కోవిన్ కావేరి' అనే మూవీ చేసింది.
(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?)
తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్.. ఇలా స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింది. 2010-19 వరకు దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీలో వరస చిత్రాలు చేసిన సమంత.. ఆ తర్వాత మాత్రం వరస ఫ్లాపుల దెబ్బకు డౌన్ అయిపోయింది. మధ్యలో ఈమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్టు తెలియడంతో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చింది.
సినిమాలతో పాటు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న ఉగ్రవాది తరహా పాత్రలో నటించి షాకిచ్చింది. అప్పటివరకు గ్లామరస్ రోల్స్‌లో సామ్‌ని చూసిన ఫ్యాన్స్.. ఈ సిరీస్‌లో సమంత డీ గ్లామర్ గెటప్, ఫైట్స్ చేయడం చూసి అవాక్కయ్యారు.
(ఇదీ చదవండి: సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్)
సమంతకు యశోద అనే మరోపేరు కూడా ఉంది. ఈ విషయం దాదాపు ఎవరికీ తెలియదు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఆమెని ఈ పేరుతో పిలుస్తారు. 'యశోద' పేరుతో సమంత ఓ సినిమా కూడా చేయడం విశేషం. అలానే 2012లో తెలుగు, తమిళంలో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. రేవతి తర్వాత ఈ ఘనత సాధించిన రెండో హీరోయిన్‌గా ఘనత సాధించింది.
2013లో తనకు డయాబెటిస్ ఉన్నట్లు బయటపెట్టిన సమంత.. జిమ్, హెల్తీ ఫుడ్ తీసుకుని ఆ వ్యాధి నుంచి బయటపడింది. కానీ ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. 2022 అక్టోబరులో ఈ విషయాన్ని బయటపెట్టింది. దీని వల్ల దీర్ఘకాలిక కండరాల వాపు వస్తుంది. ప్రస్తుతం కొంతమేర దీన్నుంచి కోలుకుంది. పూర్తిగా నార్మల్ అవ్వాలంటే మాత్రం కొన్నేళ్లు పట్టొచ్చు!
(ఇదీ చదవండి: 'ఫ్యామిలీ స్టార్' పరువు తీస్తున్న దోశ.. ఆ వార్నింగ్ సీన్ కూడా!)
సినిమాల సంగతి పక్కనబెడితే సమంత వ్యక్తిగత జీవితం అంతకు మించి అనేలా ఉంటుంది. అక్కినేని హీరో నాగచైతన్యని ప్రేమించింది. 2017లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. కానీ ఏమైందో ఏమో గానీ 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీలో అందరూ షాకయ్యారు. కారణం ఏంటో తెలియకుండానే సమంతపై చాలా విమర్శలు చేశారు. పర్సనల్ స్టైలిష్ట్‌తో ఎఫైరే దీనికి కారణమని అన్నారు. అసలు ఏం జరిగిందనేది ఇప్పుటికీ సస్పెన్సే.
సాధారణంగా హీరోయిన్లు పెద్దగా వివాదాలు జోలికి వెళ్లరు. కానీ సమంత మాత్రం ఈ విషయంలో కాస్త డిఫరెంట్. కోరి తెచ్చుకునేలా కొన్నింటిని నెత్తిన పెట్టుకునేది. ట్రోలింగ్‌కి గురయ్యేది. అయితే ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా సరే సమంతలో ఓ మంచి మనిషి కూడా ఉంది. పేద పిల్లలు, మహిళల సంక్షేమం కోసం 'ప్రత్యూష సపోర్ట్' అనే ఎన్జీవో స్థాపించి చాలామందికి సహాయపడుతోంది. ఇలా సమంత జీవితం చూసుకుంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని స్థాయి నుంచి మొదలై.. స్టార్ హీరోయిన్ హోదా అనుభవించి.. పెళ్లి జీవితంతో విమర్శలు ఎదుర్కొని.. పరిస్థితులు ఎదురు తిరిగిన నిలబడి గెలిచిన బ్యూటీ సామ్.
(ఇదీ చదవండి: ఎక్కడెక్కడో టచ్ చేశారు.. వస్తావా అంటే తెలియక సరే అన్నాను: కీర్తి భట్)
Comments
Please login to add a commentAdd a comment