సెంచరీలతో చెలరేగిన రవీంద్ర, కేన్‌ విలియమ్సన్‌.. తొలి రోజు కివీస్‌దే | Sakshi
Sakshi News home page

SA vs NZ 1st: సెంచరీలతో చెలరేగిన రవీంద్ర, కేన్‌ విలియమ్సన్‌.. తొలి రోజు కివీస్‌దే

Published Sun, Feb 4 2024 1:50 PM

New Zealand dominate opening day with Rachin Ravindra,kane centuries - Sakshi

మౌంట్‌ మౌన్‌గనూయ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆటలో న్యూజిలాండ్‌ అధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో కేన్‌ విలియమ్సన్‌, రచిన్‌ రవీంద్ర అద్భుత సెంచరీలతో చెలరేగారు.

ఇన్నింగ్స్ ఆరంభంలోనే డేవాన్ కాన్వే(1), టామ్ లాథమ్(20) వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు అజేయంగా 221 పరుగులు జోడించారు.

రవీంద్ర(118), కేన్‌ విలియమ్సన్‌(112) పరుగులతో క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డేన్ ప్యాటర్సన్, మోరెకి తలా వికెట్‌ సాధించారు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌ కారణంగా ఈ సిరీస్‌కు ప్రోటీస్‌ సీనియర్‌ ఆటగాళ్లు దూరంగా ఉన్నారు.
చదవండి: IND vs ENG: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. ప్రిన్స్‌ ఈజ్‌ బ్యాక్‌! సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్‌ గిల్‌

Advertisement
 
Advertisement