‘మేమంతా సిద్ధం’ | Sakshi
Sakshi News home page

‘మేమంతా సిద్ధం’

Published Fri, Apr 19 2024 1:30 AM

- - Sakshi

విజయఢంకా మోగించేందుకు

టెక్కలి విజయం ఎంతో కీలకం

ఈ ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం విజయం ఎంతో కీలకం. ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు ఎంపీ అభ్యర్థి సమన్వయంతో నాయకులతో కలిసి విజయం వైపు పయ నించాలి. టెక్కలిలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయ సంకేతాలు కనిపించాలి. –మజ్జి శ్రీనివాసరావు,

పార్టీ ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్‌ కోఆర్డినేటర్‌

జనం సిద్ధంగా ఉన్నారు..

గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేసిన సీఎం వైఎస్‌ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 24న టెక్కలిలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రను అన్ని వర్గాలు విజయవంతం చేయాలి. – ధర్మాన కృష్ణదాస్‌,

ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు.

ప్రతిపక్షాల వెన్ను వణకాలి

టెక్కలిలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రతిపక్షాల వెన్ను వణకాలి. జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాలు ఈ బస్సు యాత్రను విజయవంతం చేయాలి.

– పేరాడ తిలక్‌, వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి.

టెక్కలి: టెక్కలిలో ఈ నెల 24న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ము గింపు కార్యక్రమం నిర్వహించనున్నారని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు. యాత్రకు సంబంధించి గురువా రం టెక్కలిలో ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో గల కీలకమైన నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ టెక్క లి నియోజకవర్గంలో గత టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ఇటీవల టీడీపీ నాయకులు చేసిన కుట్ర పూరిత చర్యల వల్ల దివ్యాంగులు, వృద్ధులు ఎలా ఇబ్బంది పడ్డారో ప్రజలకు వివరించాలని సూచించారు.ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ డిప్యూటీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ మజ్జి శ్రీనివాస్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి పిరియా సాయి రాజ్‌, కళింగ కోమటి కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, పార్టీ మహిళా విభా గం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, సంతబొ మ్మాళి జెడ్పీటీసీ పి.వసంత్‌రెడ్డి, నాలుగు మండలాల అధ్యక్షులు కె.అజయ్‌కుమార్‌, కె.సతీష్‌, ఎన్‌.సత్యరాజ్‌, టి.పాల్గుణరావు, నందిగాం ఎంపీపీ ఎన్‌.శ్రీరామ్ముర్తి, పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌లు ఎస్‌.సత్యం, బి.మురళీ, కె.జగన్నాయకులు, నాయకులు చింతాడ గణపతి, చింతాడ రవికుమార్‌, ఎం.స్వరూప్‌, కె.రాజేశ్వరరావు, టి.కిరణ్‌, ఆర్‌.మల్లయ్య, ఎస్‌.హేమ సుందర్‌రాజు, ఎం.అప్పారావు, ఎ.కల్యాణి, జేసీఎస్‌ ఇన్‌చార్జిలు ఎస్‌.మోహన్‌, జె.జయరాం, జి.నాగుతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి

టెక్కలి నియోజకవర్గంలో ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో దశాబ్దాల అభివృద్ధి జరిగింది. సుమారు 1500 కోట్ల రూపాయలతో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేశారు. మూలపేట పోర్టుతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు రూ.7 వేల కోట్లు వెచ్చించారు. టెక్కలి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ విజయాన్ని సీఎంకు కానుకగా ఇస్తాం. – దువ్వాడ శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, టెక్కలి

కుప్పం, టెక్కలి నియోజకవర్గాల్లో

విజయ పతాకం ఎగురవేద్దాం

24న టెక్కలిలో సీఎం వైఎస్‌ జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు

యాత్ర సన్నాహక సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి

1/4

2/4

3/4

4/4

Advertisement
 
Advertisement
 
Advertisement