ఫోన్ ట్యాపింగ్ కేసు: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం | Sakshi
Sakshi News home page

ఫోన్ ట్యాపింగ్ కేసు: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

Published Thu, Apr 11 2024 9:45 PM

Key Decision Of Telangana Government In Phone Tapping Case - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఈనెల 15న నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

కాగా, ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)ని కోరారు. ఈ కేసులో పీఎంఎల్‌ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్‌లు ట్యాప్‌ చేసి వారిని బ్లాక్‌ మెయిల్‌ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బును  పోలీసు వాహనాల్లో  ఎన్నికల కోసం తరలించారని నిందితులే ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటికి వస్తారని ఫిర్యాదులో తెలిపారు. 

కాగా, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్‌లు ట్యాప్‌ చేసిన కేసులో పోలీసులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో కీలక పాత్ర వహించిన పలువురు పోలీసు ఉన్నతాధికారులను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: కిడ్నాప్‌ చేసి.. బెదిరించి 

Advertisement

తప్పక చదవండి

Advertisement