Hyderabad Man Tries To Escape From Police By Using Face Mask, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

ఇదేమి చోద్యం? మూతికి ఉండాల్సిన మాస్క్‌ నంబర్‌ ప్లేటుకు ..

Published Fri, Oct 29 2021 7:54 AM

Man Using Face Mask To Bike Number Plates To Escape From Police - Sakshi

MAN Using Face Mask On Number Plate: కరోనా వైరస్‌ ఇంకా పూర్తిగా పోనేలేదు.. ఇంతలోనే కొంతమంది వాహనదారులకు మరో వైరస్‌ సోకింది.. మూతికి ఉండాల్సిన మాస్కు బండి నంబర్‌ ప్లేటుకు చేరింది.. తలకు ఉండాల్సిన హెల్మెట్‌ హ్యాండిల్‌కు షిఫ్ట్‌ అయ్యింది.

దీంతో చేతిలో ఉన్న కెమెరాతో వాహనదారుల నంబర్‌ ప్లేట్స్‌పై క్లిక్‌మనిచే ట్రాఫిక్‌ పోలీసులకు తల నొప్పి మొదలైంది. ఇలా ఒకరో ఇద్దరో కాదు వందల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు రయ్యిమంటూ దుసుకుపోతున్నా ఏం చేయలేని దుస్థితి పోలీసులది.. గురువారం అత్తాపూర్‌లో కనిపించింది ఈ దృశ్యం..  
చదవండి: ఆఫీసుకు హాయ్‌.. ఇంటికి బైబై.. కారణం ఇదే! 

Advertisement
 
Advertisement
 
Advertisement