
టీ20 ప్రపంచకప్-2024తో బిజీగా ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త సమయం దొరికినా కుటుంబంతో గడిపేస్తున్నాడు

అమెరికాలో భారత జట్టు లీగ్ దశ మ్యాచ్‌లు ఆడుతున్న వేళ విరామ సమయంలో భార్య రితికా, కూతురు సమైరా శర్మతో కలిసి అవుటింగ్‌కి వెళ్తున్నాడు

ఇటీవల పాకిస్తాన్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రకృతిని ఆస్వాదిస్తున్నా అంటూ ఫొటో షేర్ చేశాడు

రోహిత్ ఇక టీమిండియా ప్రస్తుతం సూపర్-8కు చేరుకున్న తర్వాత మరోసారి కాస్త బ్రేక్ తీసుకున్నాడు కూతురు సమైరాతో కలిసి బీచ్‌కు వెళ్లిన హిట్‌మ్యాన్ ఇసుకలో గూళ్లు కడుతూ చిన్నపిల్లాడిలా మారిపోయాడు

ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి కాగా గ్రూప్ దశలో కెనడాతో ఆఖరి మ్యాచ్ ఆడిన తర్వాత టీమిండియా వెస్టిండీస్‌కు పయనం కానుంది












