వైఎస్సార్‌లాంటి పాలన అందిస్తాం: రేవంత్ రెడ్డి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి:రేవంత్ రెడ్డి

Published Mon, Mar 6 2023 4:18 AM

Tpcc Revanth Reddy fire On CM KCR In Padayatra - Sakshi

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించి తెలంగాణ ఇచి్చన కాంగ్రెస్‌ పారీ్టకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. వైఎస్సార్‌ లాంటి పాలన అందిస్తాం’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర లో భాగంగా ఆదివారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. 2024లో కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, యువకులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, రూ.500కే ఇంటికి గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తామని హామీనిచ్చారు. 

ఆది శ్రీనివాస్‌ సూచనతో.. 
2005లో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో స్థానిక కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ సూచనతో మెట్టప్రాంతమైన వేములవాడకు రూ.1,735 కోట్లతో ఎల్లంపల్లి నీళ్లను ఫాజుల్‌నగర్‌ వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచి్చందని రేవంత్‌ చెప్పారు. ఇది తెలుసుకున్న సీపీఐ సీనియర్‌ నేత సీహెచ్‌.రాజేశ్వర్‌రావు ఓ సభలో స్వయంగా ఆది శ్రీనివాస్‌ వయసులో చిన్నవాడైనా వైఎస్సార్‌ను ఒప్పించి ఈ ప్రాంతానికి సాగునీరు తెచ్చి ఎంతో గొప్ప పని చేశారంటూ మెచ్చుకున్న వైనం ఈ ప్రాంతప్రజలు మరచిపోవద్దన్నారు.

 43 వేల ఎకరాలకు సాగునీరు హామీ ప్రగల్బాలే
స్వరాష్ట్రం సిద్ధించాక అధికారంలోకి వచ‍్చినపుడు మంత్రి హరీశ్‌రావు ఫాజుల్‌నగర్‌లో 43 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రగల్భాలు పలికారని రేవంత్‌ విమర్శించారు. ఎన్నికల్లో ఓట్లు దండుకుని ఇప్పటికీ ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రసంగించారు. 

సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్‌ వివక్ష 
కథలాపూర్‌: ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రుల మాదిరిగానే తెలంగాణలోనూ సీఎం కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టులపై వివక్ష చూపిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కలిగోట గ్రామ శివారులోని అసంపూర్తిగా మిగిలిన సూరమ్మ రిజర్వాయర్‌ను పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆది శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే 18 నెలల్లో సూరమ్మ రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement