వీఎన్‌సీ, ఎంఎఫ్‌సీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు | Sakshi
Sakshi News home page

వీఎన్‌సీ, ఎంఎఫ్‌సీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు

Published Fri, Apr 19 2024 1:05 AM

-

మహారాణిపేట: కేంద్రీయ మత్స్య నావిక, ఇంజినీరింగ్‌ శిక్షణా విభాగం ఆధ్వర్యంలో వెస్సెల్‌ నేవిగేటర్‌(వీఎన్‌సీ), మైరెన్‌ ఫిట్టర్‌(ఎంఎఫ్‌సీ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రెండేళ్ల కాల పరిమితి గల ఈ కోర్సులకు విశాఖ, కొచ్చి, చైన్నె ఏరియాల్లో శిక్షణ ఉంటుంది. పదో తరగతిలో మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు. ఈ ఏడాది ఆగస్టు నాటికి 15 నుంచి 20 సంవత్సరాల్లోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీలకు ఐదేళ్లు మినహాయింపు ఉంటుంది. అఖిల భారత స్థాయిలో కామన్‌ ఎంట్రాన్స్‌ టెస్ట్‌ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తారు. దరఖాస్తులను www.cifnet.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడు చేసుకుని, జూన్‌ 14వ తేదీలోగా ది డైరెక్టర్‌, cifnet, fine arts avenue, cochin-682 016 చిరునామాకు పంపాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement