వాహనాలు, ప్రచార రథాలు సిద్ధం | Sakshi
Sakshi News home page

వాహనాలు, ప్రచార రథాలు సిద్ధం

Published Fri, Apr 19 2024 1:05 AM

- - Sakshi

మే 13వ తేదీన రాష్ట్రంలో ఈ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. అంటే పోలింగ్‌కు ఇంకా 24 రోజుల మాత్రమే సమయం ఉంది. అందువల్ల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉధృతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి పదుల సంఖ్యలో ప్రచార రథాలు, వాహనాలను సమకూర్చుకున్నారు. ప్రచారానికి అవసరమైన మైకులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, అభ్యర్థుల కటౌట్లతో పాటు తమ అధినేతల ఫొటోలు వంటివన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ వాహనాలకు ఎన్నికల ప్రచార అనుమతులు కూడా తీసుకున్నారు. గురువారం నుంచి వీటిని రోడ్డెక్కించి ఊరూ వాడా తిప్పుతూ హోరెత్తించనున్నారు. ఆ నియోజకవర్గానికి పాత అభ్యర్థి అయితే గతంలో తాను చేసిన అభివృద్ధితో పాటు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ పథకాలను, ప్రత్యర్థుల బలహీనతలు, అవినీతి అరోపణలను ఏకరువు పెట్టనున్నారు. తొలిసారి బరిలో దిగుతున్న వారైతే తమను గెలిపిస్తే చేయబోయే అభివృద్ధిని, ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను వివరించనున్నారు. ఒక్కసారి తనను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement