సంక్షేమం సగం బలం | Sakshi
Sakshi News home page

సంక్షేమం సగం బలం

Published Wed, May 8 2024 4:45 AM

-

పథకాల ద్వారా ఇంటిల్లిపాదికీ లబ్ధి రూ.రెండున్నర లక్షలకుపైగా సాయం
చిన్న కుటుంబానికి కొండంత మేలు

యస్సు మీద పడుతున్నా.. కుటుంబం కాడిని బలవంతాన భుజానికెత్తుకుని లాగాల్సిన స్థితి. చింతలున్న చిన్న కుటుంబమమే అయినా, ఆశలను వాయిదా వేసుకోవాలి. ఉన్న కాడికి నాలుగు మెతుకులు తిని, నీడ పట్టున కునుకు తీద్దామనుకొనే లోగా, కష్టాల స్వప్నాలు నిద్రాభంగం కలిగించేవి. ఉన్న ఒక్క బిడ్డ చిన్న ప్రైవేటు ఉద్యోగి. బిడ్డ తెచ్చే నాలుగు రూపాయలు వేన్నీళ్లకు చన్నీళ్లుగా మాత్రమే ఉపయోగపడేవి. వృద్ధాప్య పింఛన్‌ పొందే అర్హత ఉన్నా, గ్రామంలో ఎవరైనా చనిపోతే చెప్పు, జన్మభూమి కమిటీతో చెప్పించుకో పింఛన్‌ వస్తుందనే పచ్చనాయకుల ఉచిత సలహాలు. ఐదేళ్ల క్రితం వరకు ఇదే తీరు. రెక్కల కష్టాన్ని నమ్ముకొని గౌరవంగా కుటుంబాన్ని ఈడ్చుకొస్తున్న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి గ్రామంలోని దూలపల్లి సుబ్బారావు కుటుంబానికి సీఎం వైఎస్‌ జగన్‌ వరాల రేడుగా మారారు.

Advertisement
 
Advertisement