కాంగ్రెస్‌ ఖాతాలోకి అడ్డగూడూరు పీఏసీఎస్‌ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఖాతాలోకి అడ్డగూడూరు పీఏసీఎస్‌

Published Thu, May 9 2024 6:30 AM

కాంగ్

అడ్డగూడూరు : అడ్డగూడూరు పీఏసీఎస్‌ చైర్మన్‌గా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొప్పుల నిరంజన్‌రెడ్డి ఎన్నికయ్యారు. అప్పటి చైర్మన్‌ పొన్నాల వెంకటేశ్వర్లుపై కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బుధవారం ఉదయం 11గంటలకు స్థానిక పీఏసీఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో డీసీఓ ప్రవీణ్‌కుమార్‌ సమక్షంలో ఓటింగ్‌ నిర్వహించారు. పీఏసీఎస్‌లో 13 మంది డైరెక్టర్లుగా ఉండగా వైస్‌ చైర్మన్‌ చేడే చంద్రయ్య, 8మంది డైరెక్టర్లు సమావేశానికి హాజరయ్యారు. అవిశ్వాసానికి మద్దతుగా తొమ్మిది మంది డైరెక్టర్లు చేతులు ఎత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గినట్లు డీసీఓ ప్రకటించారు.

జనవరి 9న డీసీఓకు నోటీస్‌ అందజేత

పీఏసీఎస్‌లో కాంగ్రెస్‌కు 6, బీఆర్‌ఎస్‌ 6, సీపీఐకి ఒకరు చొప్పున డైరెక్టర్లు ఉన్నారు. చైర్మన్‌గా బీఆర్‌ఎస్‌ డైరెక్టర్‌ పొన్నాల వెంకటేశ్వర్లు, వైస్‌ చైర్మన్‌గా సీపీఐ డెరెక్టర్‌ చెడే చంద్రయ్య ఎన్నికయ్యారు. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో తొమ్మిది మంది డైరెక్టర్లు చైర్మన్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ జనవరి 22వ తేదీన డీసీఓకు సంతకాలతో కూడిన నోటీస్‌ అందజేశారు. మరుసటి రోజునుంచి 9 మంది డైరెక్టర్లు క్యాంపునకు వెళ్లారు. ఫిబ్రవరి 9న అవిశ్వాసం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా పొన్నాల వెంకటేశ్వర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం స్టే ఇస్తూ తీర్పు వెలువరించింది. ఇటీవల కోర్టు స్టే ఎత్తివేయడంతో పాటు అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీసీఓ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఓటింగ్‌ నిర్వహించగా.. తొమ్మిది మంది డైరెక్టర్లు మాజరై కొప్పుల నిరంజన్‌రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో నిరంజన్‌రెడ్డి చైర్మన్‌గా ఎన్నికై నట్లు డీసీఓ ప్రకటించారు.

హాజరుకాని డైరెక్టర్లు వీరే..

చైర్మన్‌ పొన్నాల వెంటకటేశ్వర్లతో పాటు ఎల్లంల వీరస్వామి, బాలెంల ఎల్లమ్మ, పోగులు నర్సిరెడ్డి అవిశ్వాస సమావేశానికి గైర్హాజరయ్యారు.

ఫ నెగ్గిన అవిశ్వాస తీర్మానం

ఫ నూతన చైర్మన్‌గా కొప్పుల నిరంజన్‌రెడ్డి

కాంగ్రెస్‌ ఖాతాలోకి అడ్డగూడూరు పీఏసీఎస్‌
1/1

కాంగ్రెస్‌ ఖాతాలోకి అడ్డగూడూరు పీఏసీఎస్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement