'రాయలసీమలో సైకిల్ తొక్కిన అనుభవం ఉంది'
కోవెలకుంట : సినీనటుడు సునీల్ కర్నూలు జిల్లాలో సందడి చేశాడు. తన ప్రసంగంతో జనాలను ఉర్రూతలూగించాడు. కోవెలకుంట్ల మండలంలోని గుళ్లదూర్తిలో హోమియో పితామహుడు డాక్టర్ హానెమన్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సునీల్ ఆదివారం పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు చమక్కులు, జోకులతో స్థానికుల్ని కడుపుబ్బా నవ్వించాడు.
కోనసీమవాసులకు కంగారెక్కువని, రాయలసీమ వాసులకు ధైర్యమెక్కవని అన్నారు. తాను సినీ రంగంలోకి రాకముందు డయాగ్నటిక్ సెంటర్లో నెలకు రూ.1200 వేతనంతో పపనిచేసేవాడినని చెప్పాడు. డాక్టర్ వద్దకు వచ్చే వద్దులకు త్వరగా వైద్యం అందాలన్న ఉద్దేశంతో మొదటి పది నంబర్లు అలాగే ఉంచేవాడినని గుర్తు చేసుకున్నాడు. పెద్దల ఆశీస్సులతోనే తాను సినీరంగంలో రాణిస్తున్నానని పేర్కొన్నారు. సినిమా షూటింగ్ సందర్భంగా రాయలసీమలో సైకిల్ తొక్కిన అనుభవం ఉందని గుర్తు చేశాడు.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)