కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు: రావెల
హైదరాబాద్: స్థానికతపై తెలంగాణ సీఎ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఆర్టికల్-371(డీ) ఉండగా కొత్త నిబంధనలు ఎలా తీసుకువస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. గవర్నర్, కేంద్రం తక్షణమే చొరవ తీసుకుని ఈ విషయంలో జోక్యం చేసకోవాలని విజ్క్షప్తి చేశారు. రాష్ట్రాలు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు.
విద్యార్థులకు ఆర్థిక సాయం కోసం ఉద్దేశించిన కొత్త పథకం ఫాస్ట్ (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) అమలుకు స్థానికత, ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. 1956కు ముందు తెలంగాణలో నివాసం కలిగి ఉన్న వారికే దీన్ని వర్తింపచేస్తామని, ఈ దిశగా ఆర్థిక, సాంఘిక సంక్షేమ, విద్యా శాఖలు మార్గదర్శకాలు రూపొందిస్తాయని ఆయన వెల్లడించారు.