బాహుబలి-2 తొలి రోజే రికార్డులు సృష్టించనుందా? | 'Baahubali-2': The Conclusion' could be the game changer in Indian cinema | Sakshi
Sakshi News home page

బాహుబలి-2 తొలి రోజే రికార్డులు సృష్టించనుందా?

Published Wed, Apr 26 2017 3:47 PM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM

బాహుబలి-2 తొలి రోజే రికార్డులు సృష్టించనుందా?

బాహుబలి-2 తొలి రోజే రికార్డులు సృష్టించనుందా?

ముంబై : బాహుబలి-2 కౌంట్ డౌన్ మొదలైంది. రేపే అన్ని థియేటర్ల సిల్వర్ స్క్రీన్లపైకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెట్లను జోరుగా కొనుగోలు చేయగా.. భారీగా థియేటర్ల ముందు ప్రేక్షకులు బారులు తీరారు. దాదాపు సినిమా ప్రదర్శించబోయే అన్ని థియేటర్ల టిక్కెట్లు బుక్ అయిపోయాయి. బాహుబలి పార్ట్-1 లో సస్పెన్షన్గా ఉన్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అయితే 2015లో విడుదలైన పార్ట్-1 బాక్స్ ఆఫీసు వద్ద రికార్డుల మోత మోగించింది. రేపు విడుదల కాబోతున్న బాహుబలి పార్ట్-2 మరెన్ని రికార్డుల సృష్టిస్తోందని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9వేల స్క్రీన్లపై దీన్ని ప్రదర్శించబోతున్నారు. తమిళనాడు, కేరళలలో 70-75 శాతం బాహుబలి పార్ట్-2 కోసమే బుక్ అవ్వగా.. తెలంగాణ ఆంధ్ర్రప్రదేశ్ లలో 80 శాతం థియేటర్లలో ఈ సినిమానే విడుదల చేస్తున్నారు. 9వేల స్క్రీన్లలో రోజుకు 5 షోలు. అంటే ఒక్క షోకు 300 మంది చొప్పున తీసుకున్నా.. తొలిరేజే రూ.135 కోట్లకు పైగా బాక్సాఫీసు కలెక్షన్లను వసూలు చేయనుందని ఫిల్మ్ ట్రేడ్ అనాలిస్టులు  చెబుతున్నారు.
 
ఫిల్మ్ యూనిట్ అభ్యర్థన మేరకు సింగిల్ స్క్రీన్ థియేటరల్లో 10 రోజులు పాటు రోజుకు ఆరు షోలు వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈ వసూలు మరింత పెరుగనున్నాయని అనాలిస్టులు పేర్కొంటున్నారు. అంటే అదనంగా మరో రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేర తొలి వీక్ కలెక్షన్లు నమోదుకానున్నాయని ఫిల్మ్ ట్రేడ్ అనాలిస్టు శ్రీధర్ పిలై చెప్పారు. అయితే తెలంగాణలో రోజుకు ఐదు షోలు మాత్రమే వేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది.  ఈ సినిమా హిందీ వెర్షన్ అద్భుతంగా ఉందని, హిందీ వెర్షన్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఎక్స్లెంట్ గా నమోదయ్యాయని పిలై పేర్కొన్నారు. ఇప్పటికే అంచనాలను అధిగమించి టిక్కెట్లను ప్రేక్షకులు బుక్ చేసుకున్నారని హిందీ ఫిల్మ్ ట్రేడ్ అనాలిస్టు కోమల్ నహ్తా తెలిపారు. ఈ సినిమా తొలి పార్ట్ దేశీయ బాక్స్ ఆఫీసు కలెక్షన్లు గ్రాస్ రూ.360 కోట్ల నుంచి రూ.370 కోట్ల వసూలయ్యాయి.
 
కంక్లూజిన్ పార్ట్ లో 450 కోట్ల నుంచి 460 కోట్ల వసూలుచేయొచ్చని కోమల్ అంచనావేస్తున్నారు. ఇదే దేశీయ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లని పేర్కొన్నారు. ఓవర్సిస్ మార్కెట్లోనూ ఇది దుమ్మురేపబోతుందట. దుబాయ్ లో ఇప్పటికే లక్షకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయని పిలై తెలిపారు. ఇప్పటివరకు ఏ సినిమాకు లేని అడ్వాన్స్ బుకింగ్స్ దీనికి దక్కినట్టు వెల్లడించారు. సింగపూర్, మలేసియా, నార్త్ అమెరికాలోనూ ఇది రికార్డులు సృష్టిస్తుందని పిలై అంచనావేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement