సాక్షి, గుంటూరు: మునిసిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలాగోలా గట్టెక్కామని సంబరపడుతున్న టీడీపీ ముఖ్యనేతలు సొంత గ్రామాల్లోనే టీడీపీని గెలిపించుకోలేకపోవడంపై పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయి. జిల్లాలోని అనేక మంది టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రస్తుతం పోటీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు తమ సొంత గ్రామాల్లో ఎంపీటీసీలను గెలిపించుకోలేక చతికిలబడ్డారు. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా గెలిచి టీడీపీలో జిల్లా స్థాయి నాయకులుగా చలామణి అవుతున్న వీరంతా సొంత గ్రామాల్లో పార్టీని గెలిపించుకోలేకపోయారు. పార్టీకోసం కష్టపడి పనిచేయాలంటూ ఉపన్యాసాలు ఇచ్చే నేతలంతా తమ స్వగ్రామాల్లో పార్టీని బలహీన పరుస్తూ కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని తమ్ముళ్లు మండి పడుతున్నారు.
దీనికి తోడు అనేక నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటలుగా ఉన్న అనేక గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేయడం తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే, ఇక సార్వత్రిక ఎన్నికల్లో మరింతదెబ్బతినే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. కారంపూడి మండలం నరమాలపాడు గ్రామం ఆదినుంచి టీడీపీకి కంచుకోటగా ఉంటుంది. గ్రామంలో ఇటీవల వైఎస్సార్‌సీపీ నాయకుడిని టీడీపీ నేతలు హత్య కూడా చేశారు. అయితే మండలపరిషత్ ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్‌సీపీ సుమారు 500 పై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించింది. నరసరావుపేట నియోజకవర్గం రావిపాడు గ్రామం అనేక దశాబ్దాలుగా టీడీపీకి పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. ఈ గ్రామంలో సైతం ఎంపీటీసీ ఎన్నికల్లో రెండు ఎంపీటీసీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుని సత్తా చాటింది.
టీడీపీ ముఖ్యనేతల గ్రామాల్లో...
జిల్లాలోని అనేక మంది టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుతం పోటీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల సొంత గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం మంచికల్లు గ్రామం గురజాల సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సొంత గ్రామం. ఇక్కడ వైఎస్సార్‌సీపీకి 1285 ఓట్లురాగా, టీడీపీకి 1093 ఓ ట్లు వచ్చాయి. ఇక్కడ వైఎస్సార్‌సీపీ 192 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది.
ఇదే నియోజకవర్గం శిరిగిరిపాడు గ్రామం మాజీ టీడీపీ ఎమ్మెల్యే కుర్రిపున్నారెడ్డి సొంత గ్రామం. ఇక్కడ సైతం వైఎస్సార్‌సీపీకి 40 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక్కడ వైఎస్సార్‌సీపీకి 1880 ఓట్లు రాగా, టీడీపీకి 1840 ఓట్లు వచ్చాయి. ఇదే మండలం వెల్దుర్తి మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి నాగిరెడ్డి, జూలకంటి దుర్గాంబ సొంత గ్రామం. ప్రస్తుత ం టీడీపీ తరఫున వీరి తనయులు జూలకంటి బ్రహ్మారె డ్డి, శ్రీనివాసరెడ్డిలు టిక్కెట్లు ఆశించిభంగపడ్డారు.ఇక్కడ సైతం వైఎస్సార్‌సీపీకి 75ఓట్ల మెజార్టీ వచ్చింది.ఇక్కడ వైఎస్సార్‌సీపీ 1393 ఓట్లు రాగా, 1318 ఓట్లు వచ్చా యి.
ఇదే మండలం కండ్లకుంట గ్రామం మాజీ ఎమ్మె ల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి ప్రస్తుత టీడీపీ అభ్యర్థి కొమ్మారెడ్డి చలమారెడ్డిల సొంత గ్రామం. ఇక్కడ వైఎస్సార్‌సీపీకి 680 ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. ఇక్కడ వైఎస్సార్‌సీపీకి 1327 ఓట్లు రాగా, టీడీపీకి 647 ఓట్లు వచ్చాయి. ఈ గ్రామం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత గ్రామం కూడా కావడం గమనార్హం. పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర స్వగ్రామమైన పొన్నూరు మండలం చింతలపూడి -2 ఎంపీటీసీ స్థానంలో 24 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఇక్కడ వైఎస్సార్‌సీపీకి 902 ఓట్లు రాగా, టీడీపీకి 878 ఓట్లు వచ్చాయి.
నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మం డలం సంతగుడిపాడు అక్కడి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నలబోతు వెంకట్రావు జన్మస్థలం. ఇక్కడ 232 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. వైఎస్సార్‌సీపీకి 1307 ఓట్లు రాగా, టీడీపీకి 1075 ఓట్లు వచ్చాయి. ఇదే మండలంలోని బుచ్చిపాపన్నపాలెం వైఎస్సార్‌సీపీ నరసరావుపేట నియోజకవర్గ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సొంత గ్రామం. ఈ గ్రామంలోని ఎంపీటీసీ స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుపొంది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన సత్తా చాటారు.
రేపల్లె మండలం ఉప్పూడి ప్రస్తుత తాడికొండ టీడీ పీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్ సొంత గ్రామం. ఇక్కడ వైఎస్సార్‌సీపీ 239 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. వైఎస్సార్‌సీపీకి 1204 ఓట్లు రాగా, టీడీపీకి 965 ఓట్లు వచ్చాయి.
ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండ లం అబ్బినేనిగుంటపాలెం మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, వైఎస్సార్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ ఎమ్మె ల్యే అభ్యర్థి రావి వెంకటరమణల సొంత గ్రామం. ఇక్క డ వైఎస్సార్‌సీపీ 650 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. ఇక్కడ వైఎస్సార్‌సీపీకి 1509 ఓట్లు రాగా, టీడీపీకి 859 ఓట్లు వచ్చాయి. ఇక్కడ విజయం సాధించి రావి వెంకటరమణ తన పట్టు నిలుపుకున్నారు. సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు సొంత మండల మైన నకరికల్లు మండలపరిషత్, జిల్లాపరిషత్ స్థానాల ను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఇలా జిల్లాలోని అ నేక నియోజకవర్గాల్లో టీడీపీ ముఖ్యనేతల స్వగ్రామాల్లో సైతం వైఎస్సార్‌సీపీ పాగా వేసి పట్టు నిలుపుకుంది.
ఇంట ఓడిన దేశం నేతలు
Published Thu, May 15 2014 12:09 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement