తమిళనాడు తెలుగువారి పోరాటానికి జగన్ మద్దతు
తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తమిళనాడులోని తెలుగు వారి సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న పోరాటానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన మద్దతును ప్రకటించారని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్‌ను కలిసి ఆయన తమిళనాడులో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి ‘వినుడు... వినుడు... తెలుగోడి గోడు’ అనే పేరుతో ఆందోళన చేపట్టిన విషయాన్ని తెలిపారు.
అనంతరం కేతిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తమ సమస్యలను ఉభయ రాష్ట్రాల తెలుగువారి దృష్టికి తెచ్చేందుకు ఈ నెల 10న(గురువారం) ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తున్నట్లు వివరించారు. తెలుగు చదువుతున్న విద్యార్థులు ఒక్కసారిగా తమిళం నేర్చుకోవాలంటే ఇబ్బంది పడతారని ఇదే విషయాన్ని తాము జగన్ దృష్టికి తెచ్చామన్నారు.