![కోహ్లి.. ఒకే ఒక్కడు](/styles/webp/s3/article_images/2017/09/4/51476002952_625x300.jpg.webp?itok=sP9syK27)
కోహ్లి.. ఒకే ఒక్కడు
ఇండోర్:న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి డబుల్ సెంచరీతో ఇరగదీశాడు. భారత తొలి ఇన్నింగ్స్ లో భాగంగా విరాట్ 347 బంతుల్లో 18 ఫోర్లు సాయంతో ద్విశతకాన్ని పూర్తి చేశాడు. ఇది విరాట్ టెస్టు కెరీర్ లో రెండో డబుల్ సెంచరీ. అంతకుముందు వెస్టిండీస్ తో ఆంటిగ్వాలో జరిగిన టెస్టుల్లో విరాట్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన భారత కెప్టెన్ గా కోహ్లి కొత్త చరిత్ర సృష్టించాడు. విరాట్ నమోదు చేసిన ఈ రెండు డబుల్ సెంచరీలు ఒకే ఏడాదిలో రావడం మరో విశేషం.
ఆదివారం 267/3 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ కు విరాట్-రహానేల జోడి ఆద్యంతం ఆకట్టుకుంది. వీరిద్దరూ కుదురుగా ఆడటంతో భారత్ 144.0 ఓవర్లలో 451 పరుగులు చేసింది. ఈ జోడి నాల్గో వికెట్ కు 350 కు పైగా పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్ అత్యంత పటిష్ట స్థితికి చేరింది.