సెల్వంకు మద్దతు.. చిన్నమ్మకు ఆందోళన
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్దతు పెరుగుతోంది. అన్నాడీఎంకే చెందిన మరో ఇద్దరు ఎంపీలు సెల్వం వర్గంలో చేరారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ఉండాలని, ఆయనకు తాము మద్దతు ఇస్తామని ఎంపీలు అశోక్ కుమార్, పీఆర్ సుందరం ప్రకటించారు. నిన్నటివరకు అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మద్దతుగా ఉన్న వీరు ఆమెకు ఝలక్ ఇచ్చి సెల్వం గూటికి చేరారు. అన్నా డీఎంకేలో చీలికలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనని ఆందోళన చెందుతున్న శశికళ వర్గానికి తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
అన్నా డీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్.. సెల్వం వర్గంలో చేరిన సంగతి తెలిసిందే. అంతేగాక అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ఈసీకి లేఖ రాశారు. సెల్వం వెంట ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేలు ఉండగా, శశికళ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు ఇటువైపు దూకేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక అన్నా డీఎంకే కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో పాటు ఇతర పార్టీలు, సినీ ప్రముఖులు సెల్వంకు మద్దతు పలికారు.
సంబంధిత వార్తలు చదవండి
అమ్మ స్నేహితుల మద్దతు ఎవరికంటే..
గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు?
పన్నీర్కే 95 శాతం మద్దతు!
గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
ఎత్తుకు పైఎత్తు
నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం