కాచిగూడ : రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ నిరంజన్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం... మలక్‌పేట - డబీర్పుర రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి (సుమారు 30 సంవత్సరాలు) రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని ఒంటిపైన బ్లూ కలర్ టీ షర్టు, బూడిద రంగు ప్యాంట్ ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.