-
‘ఇది న్యాయం కాదు’.. అమీర్ సర్ఫరాజ్ హత్యపై స్పందించిన సరబ్జిత్ కుమార్తె
భారత్‌కు చెందిన సరబ్జిత్ సింగ్‌ను జైలులో హత్యచేసిన పాకిస్తాన్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం లాహోర్‌లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సర్ఫరాజ్‌ను కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో తన తండ్రిని హత్యచేసిన అమీర్ మృతిపై సరబ్జిత్ కుమార్తె స్వపన్‌దీప్ కౌర్ స్పందించారు. ‘ఒక రకంగా సంతృప్తికి కలిగినా.. ఇది న్యాయం కాదు అని భావిస్తున్నా. నా తండ్రి ఎలా హత్య చేయబడ్డారో నిర్ధారణ చేసుకోవడానికి విచారణ జరగాలని కోరుకోన్నాం. నా తండ్రి హత్యలో ముగ్గురు లేదంటే నలుగు వ్యక్తుల ప్రమేయం ఉంది. అయితే ఒక్క అమీర్‌ను హతమార్చి పాక్ ప్రభుత్వం తన తండ్రి హత్యకు జరిగిన కుట్రను కప్పిపుచ్చాలని చూస్తోంది. సరబ్జిత్, అమీర్ హత్యల వెనక పాక్ ప్రభుత్వ హస్తం ఉంది’ అని స్వపన్‌దీప్ కౌర్ తెలిపారు. అమీర్ సర్ఫరాజ్ హత్యపై సరబ్జిత్ సింగ్ బయోపిక్‌లో ప్రధాన ప్రాతలో నటించిన బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా స్పందించారు. ‘కర్మ అంటే ఇదే.. అమీర్ సర్ఫరాజ్‌ను అంతం చేసిన గుర్తు తెలియని వ్యక్తులకు ధన్యవాదాలు. ఇప్పడు సరబ్జిత్ సింగ్ హత్య విషయంలో కొంత న్యాయం జరిగినట్ల అనిపిస్తోంది. న్యాయం కోసం పోరాడిన సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ సింగ్, స్వపన్‌దీప్ కౌర్, పూనమ్లకు నా ప్రేమను తెలియజేస్తున్నా’ అని రన్‌దీప్ హుడా ఎక్స్(ట్వీటర్) వేదికగా తెలిపారు. KARMA Thank you ‘Unknown Men’ 🙏💪 Remembering my Sister Dalbir Kaur and sending love to Swapandeep and Poonam , today some justice to Martyr Sarabjit Singh has been served 🙏 https://t.co/CSn9WmevDv — Randeep Hooda (@RandeepHooda) April 14, 2024 సరబ్జిత్ సింగ్ 1991 పొరపాటుగా సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేవశించారు. 1990లో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌తో జరిగిన బాంబు పేలుళ్లలో 14 మంది పాకిస్థానీయలు మరణించారు. ఆ కేసులో గూఢచర్యం ఆరోపణలతో సరబ్జిత్ను పాకిస్థాన్ అరెస్ట్ చేసి.. ఆయనకు మరణ శిక్ష విధించింది. లాహోర్‌లోని కోట లఖపత్ జైలులో సబర్‌జిత్ సింగ్ శిక్షఅనుభివిస్తున్న సమయంలో సర్ఫరాజ్ సహా ఇతర ఖైదీలు ఆయనపై దాడి చేశారు. మెదడుకు తీవ్రగాయాలతో సరబ్జిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జైల్లో సరబ్జిత్ సింగ్‌పై దాడి చేసినందుకు అమీర్ సహా పలువురుపై కేసు నమోదైంది. అయితే.. సర్ఫరాజ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం లేకపోవటంతో 2018లో పాకిస్తాన్ కోర్టు అతన్ని నిర్ధోషిగా ప్రకటించింది. -
నాన్న ఆస్తిని అమ్మేశా, ఎవరూ సాయం చేయలేదు: నటుడు
బయోపిక్ చేయాలంటే ముందు కంటెంట్ తెలుసుండాలి, తర్వాత దాన్ని తెరకెక్కించేందుకు గట్స్ ఉండాలి. ఈ రెండూ ఉన్నందువల్లే స్వతంత్ర సమరయోధుడు సావర్కర్ జీవితాన్ని తెరపై చూపించాలని ఆరాటపడ్డాడు నటుడు రణ్‌దీప్ హుడా. ఈయన ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం స్వాతంత్య్ర వీర్ సావర్కర్. ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ రివ్యూలు అందుకుంటున్న ఈ చిత్రం ఇప్పటివరకు రూ.13 కోట్లు మాత్రమే రాబట్టింది. క్వాలిటీగా తీయాలన్న ధ్యాసే లేదు తాజాగా అతడు ఈ బయోపిక్ కోసం పడ్డ కష్టాలను ఏకరువు పెట్టాడు. 'ఈ సినిమాను గతేడాది ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నాను, లేదంటే ఈ ఏడాది జనవరి 26కు రిలీజ్ చేద్దామనుకున్నాను. అందుకోసం ఎంతో కష్టపడ్డాను. కానీ ఏదీ జరగలేదు. మా టీమ్‌లో ఉన్నవారికి సినిమా చేద్దామని ఉందే తప్ప క్వాలిటీగా తీయాలన్న ధ్యాసే లేదు. దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. నా సినిమాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు. దీంతో మా నాన్న నాకోసం పైసాపైసా కూడబెట్టి కొన్న ముంబైలోని రెండు, మూడు ప్లాట్లను అమ్మేశాను. కాలికి దెబ్బ తగిలి.. మరోవైపు నా బరువు తగ్గించేందుకు కష్టాలు పడ్డాను. కేవలం బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, మంచినీళ్లు.. ఇదే నా మెనూ అయిపోయింది. తర్వాత చాక్లెట్స్, నట్స్ తినడం మొదలుపెట్టాను.. అయినా సరే, సరైన తిండి లేకపోవడంతో ఒక్కోసారి సెట్స్‌లో పడిపోయేవాడిని. ఒకసారి గుర్రంపై స్వారీ చేస్తూ కింద పడ్డాను. కాలికి బాగా దెబ్బ తగిలి రెండు నెలలు నడవలేకపోయాను. అప్పుడు కూడా అన్నం తినకుండా డైట్ కంటిన్యూ చేశా. ఒక చెంచా బాదం బటర్, ఒక చెంచా కొబ్బరి నూనె, కొన్ని నట్స్.. ఇదే నా రోజూవారి ఆహారం. ఈ డైట్ మెయింటెన్ చేస్తూ మూడు పనులు (డైరెక్షన్, యాక్టింగ్, ప్రొడ్యూసింగ్) చేయడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. నిద్రమాత్రలు వేసుకున్నా ఒక్కోసారి సరిగా నిద్రపోయేవాడినే కాదు. ఒక్కోసారి సావర్కర్ సెట్స్‌లోనే ఉన్నట్లుగా ఓ నీడ కనిపించేది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: తెలుగులో ఆ సినిమాతో ఫుల్ క్రేజ్.. వివాదాలతో వార్తల్లో.. ఎవరో గుర్తుపట్టారా? -
ఏకంగా 26 కిలోల బరువు తగ్గి షాకిచ్చిన ‘మిస్టర్ పెర్ఫెక్ట్’!
నటించే పాత్రకు తగ్గట్టు పరకాయ ప్రవేశం చేయడం నటుల ప్రాథమిక లక్షణం. కట్టూ బొట్టు, ఆహార్యం ఇలా అన్నింటిలోనూ ఆ పాత్రకు న్యాయం చేసేందుకు నటీనటులు చాలా కష్టపడతారు. ప్రేక్షకులని అలరించేందుకు ఎంతో రిస్క్ చేసి మరీ తమ బాడీని మలచుకుంటారు. అలాంటి వారిలో తాజాగా రణదీప్ హుడా మరోసారి ప్రత్యేకంగా నిలిచాడు. 'స్వతంత్ర వీర్ సావర్కర్' బయోపిక్ కోసం విపరీతంగా బరువు తగ్గి తన లుక్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. పాత్రకు తగ్గట్టు శరీరాన్ని, ఆహార్యాన్నిమార్చుకోవడంలో రణదీప్ ప్రత్యేకతే వేరు.అందుకే రణదీప్ హుడాను హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ బాలేతో పోల్చుతారు. 2016లో సరబ్జిత్ సినిమా కోసం 20 కిలోలు, అదే ఏడాది దో లఫ్జోన్ కి కహానీ సినిమా కోసం తన బరువును 77 కిలోల నుంచి 94 కిలోలకు చేరేలా కష్టపడ్డాడు. విలక్షణ శైలితో విమర్శకుల ప్రశంసలు పొందిన నటుడాయన. 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' నుంచి సరబ్జిత్ సింగ్, ఇపుడు వీర సావర్కర్ దాకా పాత్రల్లో జీవించే ప్రతిభావంతుడైన నటుడు. సోదరి డా. అంజలి సాయం తాజాగా స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రంలో వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్రను పోషించాడు. ఈ పాత్రకోసం రణదీప్ ఏకంగా 26 కిలోల బరువు తగ్గాడు. సెల్యులార్ జైల్లో ఉన్నప్పుడు 'కాలా పానీ' పాత్ర సజీవంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నాడు. రణదీప్ హుడా సోదరి, డాక్టర్ అంజలి సాయం తీసుకున్నాడట. ఆమె రూపొందించిన పాలియో డైట్‌తో బక్క చిక్కిన దేహంతో ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేశాడు. నిపుణుల సమక్షంలో పాలియో డైట్ సోదరి డాక్టర్ అంజలి హుడా వృత్తిరీత్యా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అని,తన కోసం పాలియో డైట్‌ను రూపొందించిందని స్వయంగా రణదీప్ హుడా వెల్లడించాడు. వివిధ దశలలో గుడ్లు, నట్స్, ఖర్జూరాలు , డార్క్ చాక్లెట్లు డైట్ చేర్చుకున్నానని తెలిపాడు. దీంతోపాటు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా ఐదు రోజుల వ్యవధిలో 6-7 కిలోల బరువు తగ్గాననీ, ఈ జర్నీలో విటమిన్ సప్లిమెంట్లను కూడా తీసుకున్నానని చెప్పాడు. నిపుణుల పర్యవేక్షణలోనే ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. పెర్ఫెక్ట్గా ఉండటమే తనకిష్టమని తెలిపాడు. ఖర్జూరం, పాలుతో బరువు తగ్గుతారు అనేది ఫేక్ న్యూస్ అని కూడా చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాకు దర్శకుడిగా రణదీప్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. మార్చి 22 న ఈ మూవీ విడుదలైంది. -
ఇదేందయ్యా సామీ.. అస్థిపంజరంలా అయిపోయావ్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా కొత్త లుక్‌తో షాకిచ్చాడు. ఈసారి ఏదో హెయిర్ స్టైలో, డ్రెస్సింగ్ స్టైలో మార్చలేదు. ఏకంగా బక్కచిక్కిపోయి అస్థిపంజరంలా దర్శనమిచ్చాడు. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న స్వతంత్ర వీర్ సావర్కర్ మూవీ కోసమే ఇలా అయిపోయాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా రణ్దీపే స్వయంగా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. సోమవారం (మార్చి 18) నాడు అద్దం ముందు సెల్ఫీ దిగి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రణ్‌దీప్. మీరు గ్రేట్ సార్ ఇది చూసిన జనాలు అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్, ఇలాంటివాళ్లు కదా అసలైన యాక్టర్స్ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. హీరోలు సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ ట్రై చేయడం చూశాం.. అవసరమైతే మాస్, క్లాస్ లుక్‌లో కనిపించడం చూశాం.. కానీ ఓ సినిమా కోసం తిండీనిద్ర మానేసి మరీ ఇంతలా పీక్కుపోయినట్లుగా తయారైన వ్యక్తిని నిన్నే చూస్తున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వీరసావర్కర్ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెరీర్ అలా మొదలైంది.. కాగా 2001లో మాన్సూన్ వెడ్డింగ్ సినిమా ద్వారా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు రణ్‌దీప్ హుడా. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, జిస్మ్ 2, కాక్టెయిల్, కిక్ (బాలీవుడ్), రసియా, సర్బజిత్, హైవే వంటి చిత్రాల్లో నటించాడు. గతంలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో డేటింగ్ చేశాడు. ఆమెకు బ్రేకప్ చెప్పిన తర్వాత నటి లిన్ లైస్రామ్‌తో ప్రేమలో పడ్డాడు. గతేడాది నవంబర్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) చదవండి: ఎంత పెద్ద స్టార్ అయితే ఏంటి? అసభ్యంగా ఫోటోలు దిగే వ్యక్తి.. -
'కార్తీకదీపం' కాన్సెప్ట్‌తో హిందీలో సినిమా? హీరోయిన్గా ఇలియానా
'కార్తీకదీపం'.. ఈ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సీరియల్ ప్రేమికులు అలెర్ట్ అయిపోతారు. ఆ సీరియల్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది. కొన్నేళ్లపాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. మరీ ముఖ్యంగా ఇందులో నలుపుగా ఉండే వంటలక్క క్యారెక్టర్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్‌తో హిందీలో సినిమా తీసి రిలీజ్‌కి రెడీ చేశారు. మనకు తెలిసిన ఇలియానా హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ 'తేరా క్యా హోగా లవ్లీ'. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సేమ్ 'కార్తీకదీపం' సీరియల్లో ఉన్నట్లే ఇందులోనూ హీరోయిన్ నలుపు రంగులో ఉంటుంది. అక్కడ డాక్టర్ బాబు ఉంటే ఇక్కడ పోలీస్ బాబు ఉన్నాడంతే. (ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి పూర్ణ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే) ట్రైలర్ బట్టి చూస్తే.. హీరోయిన్ నలుపుగా ఉంటుంది. దీంతో ఈమెని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లందరూ నో చెప్పేసి వెళ్లిపోతుంటారు. ఓరోజు ఈమె పెళ్లి చేస్తే ఇవ్వడానికి అని ఉంచిన సామాన్లన్నీ దొంగతనానికి గురవుతాయి. దీంతో దర్యాప్తు కోసం ఓ పోలీస్ వస్తాడు. హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. చివరకు ఏమైంది? హీరోహీరోయిన్ ఒక్కటయ్యారా లేదా అనేదే స్టోరీ. ట్రైలర్ చూస్తే పైకి ఫన్నీగా అనిపిస్తున్నప్పటికీ.. ఇందులో అందం, వరకట్న లాంటి సామాజిక విషయాల్ని ప్రస్తావించారు. కాకపోతే వీటిని సీరియస్‌గా కాకుండా సున్నితమైన హాస్యంతో చెప్పినట్లు అనిపిస్తుంది. ఇలియానా హిట్ కొట్టి చాలాకాలమైపోయింది. మరి ఈ సినిమా అయినా ఈమెకు అదృష్టం తెచ్చిపెడుతుందేమో చూడాలి? (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోను..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement