AP CM YS Jagan Visakhapatnam And Vizianagaram Tour Live Updates - Sakshi
Sakshi News home page

Bhogapuram Airport: సీఎం జగన్‌ విజయనగరం, విశాఖ పర్యటన.. అప్‌డేట్స్‌

Published Wed, May 3 2023 9:20 AM

AP CM YS Jagan Tour Visakhapatnam Vizianagaram Live Updates - Sakshi

సీఎం జగన్‌ పర్యటన.. లైవ్‌ అప్‌డేట్స్‌

►  ఈ సెప్టెంబర్‌ నుంచి విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతుంది : సీఎం జగన్‌ 

విశాఖకు డేటా సెంటర్‌ రావడం ఆనందంగా ఉంది, డేటా సెంటర్‌తో ప్రగతి పథంలో విశాఖ దూసుకుపోతోంది, విశాఖకు ఇది గొప్ప ప్రోత్సాహకంగా నిలుస్తుంది

విశాఖ వాసులకు డేటా సెంటర్‌ గొప్ప వరం, డేటా సెంటర్‌తో 39 వేల మందికి ఉద్యోగాలు

దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ విశాఖకు వస్తోంది, ఇంత పెద్ద డేటా సెంటర్‌ దేశంలో ఎక్కడా లేదు

డేటా సెంటర్‌ ఏర్పాటు చేసినందుకు అదానీ గ్రూప్‌నకు కృతజ్ఞతలు

డేటా సెంటర్‌తో ఇంటర్‌నెట్‌ డౌన్‌ లోడ్‌ స్పీడ్‌ పెరుగుతుంది, డేటా సెంటర్‌తో విశాఖ ఏ1 సిటీగా మారనుంది

గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా చూడండి. మంచి జరిగిందని భావిస్తే నన్ను ఆశీర్వదించండి. ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టే మీ ముందుకు వచ్చే అర్హత ఉంది. మరి చంద్రబాబు నాయుడికి అలా అడిగే దమ్ముందా?.. చేసింది చెప్పడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఏం లేదు. చంద్రబాబు ముఠా దోచుకో, పంచుకో, దాచుకో అనే రీతిలో రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఏ మంచి చేయని చంద్రబాబుకు దత్త పుత్రుడు ఎందుకు సహకరిస్తున్నాడు.  

దేశ చరిత్రలో ఎక్కడా చూడని విధంగా ఈ 47 నెలల కాలంలో 2.10లక్షల కోట్ల రూపాయలు డీబీటీ చేశాం, గతానికి, ఇప్పటికీ తేడాను గమనించమని కోరుతున్నాం

► సీఎం జగన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ సాగర ప్రాజెక్ట్‌ పనులకు శంకుస్థాపన చేయనున్నాం. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్‌ హబ్‌గా మారనుంది. 

► చింతపల్లిలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ను ప్రారంభించాం. అదానీ డేటా సెంటర్‌తో ఉత్తరాంధ్ర ముఖచిత్రమే మారుతుంది. భోగాపురం ఎయిరోపోర్టును 2026లో మళ్లీ మీ బిడ్డే వచ్చి ప్రారంభిస్తాడు. ఎయిర్‌పోర్టు తీసుకురావడానికి చిత్తశుద్ధితో పనిచేశాం. 

► కేవలం ఎన్నికలకు రెండు నెలల ముందే ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేశామని చెప్పుకున్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరు. కోర్టులో కేసు వేసి అడ్డుకోవాలని చూశారు. 2026 నాటికి రెండు రన్‌వేలతో ప్రాజెక్ట్‌ టేక్‌ ఆఫ్‌ అవుతుంది. 

► మొదటి ఫేజ్‌లో 60 లక్షల మంది రవాణాకు సదుపాయాలు సమకూరుస్తాం. చివరి దశకు వచ్చే సరికి 4కోట్ల మంది ప్రయాణిస్తారు. ఏ380 డబుల్‌ డెక్కర్‌ ఫ్లైట్‌ ల్యాండ్‌ అయ్యే ఏర్పాట్లు చేస్తాం. ఉత్తరాంధ్ర అంటే మన్యం వీరుడి పౌరుషం గుర్తొస్తుంది. అందుకే ఉత్తరాంధ్రలోని కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెట్టాం. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేశాం. 

► ఉద్ధానంలో కిడ్నీ రీసర్చ్‌ సెంటర్‌ పనులను పూర్తి చేశాం. జూన్‌ నెలలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను జాతికి అంకితం చేస్తాం. 

► చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌. 

► రూ. 23.73కోట్లతో చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం. 

► భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌

విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరపల్లి వద్ద  భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ త్రీడీ మోడల్‌ను పరిశీలించిన సీఎం జగన్‌.  కాసేపట్లో ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

సీఎం జగన్‌ భోగాపురం చేరుకున్నారు.. మరికాసేపట్లో ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

► విజయనగరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. 

 విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనలో భాగంగా.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి విశాఖకు బయల్దేరారు సీఎం వైఎస్‌ జగన్‌. 

► విశాఖ పట్నంలో అదానీ డేటా సెంటర్‌, విజయనగరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొంటారు. 

► ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానా­శ్రయం నిర్మా­ణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం భూమి పూజ చేస్తారు. 

► దాదాపు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో జీఎంఆర్‌ విశాఖ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ దీన్ని నిర్మిస్తోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పాటు దేశీయ, అంతర్జాతీయ రవాణాకు దోహదపడేలా కార్గో టెర్మినల్‌ ఇక్కడి ప్రత్యేకత. తొలి దశ నిర్మాణమే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుంది. అనంతరం ఏటా  1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశలవారీగా సౌకర్యాలను విస్తరిస్తారు.

 విజయనగరం పర్యటనలో.. మరో రెండు కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేస్తారు 

► తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్‌.. 
జలయజ్ఞంలో భాగంగా విజయనగరం జిల్లాలో 24,710 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చంపావతి నదిపై 2005 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నాంది పలికారు. ఆయన హఠాన్మరణంతో ఈ ప్రాజెక్టు పనులు మందగించాయి. పెండింగ్‌ పనులను రూ.194.90 కోట్లతో పూర్తి చేసేందుకు సీఎం జగన్‌ సంకల్పించారు. పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లోని 49 గ్రామాల ప్రజలకు తాగునీరు, 24,710 ఎకరాలకు సాగునీటితో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన నీటిని అందించడం లక్ష్యంగా తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్‌ చేపట్టారు. 2024 డిసెంబర్‌ నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు.

► చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌..
విజయనగరం జిల్లాలోని వేలాదిమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తూ పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో రూ.23.73 కోట్ల వ్యయంతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం కానుంది. అన్ని కాలాల్లో సముద్రంలో చేపలు వేటాడేందుకు వెసులుబాటు కలగనుంది. తుపాన్లు, విపత్తుల సమయాల్లో సురక్షితంగా ఒడ్డుకు చేరేందుకు, అలల తాకిడికి పడవలు దెబ్బ తినకుండా లంగర్‌ వేసే సదుపాయం ఉంటుంది. తద్వారా మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టారు.

► విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ గ్రూప్‌ నిర్మించే వైజాగ్‌ టెక్‌పార్క్‌ లిమిటెడ్‌కు సీఎం జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి అదానీ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ హాజరు కానున్నారు. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా వైజాగ్‌ టెక్‌ పార్కు రూపుదిద్దుకోనుంది.

► అదానీ గ్రూప్‌ ఆధ్వర్యంలో రూ.14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్‌ పార్క్‌ ఏర్పాటు కానుంది. త్వరలో రూ.7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్‌ పార్క్‌లను అభివృద్ధి చేస్తారు. తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, మరో 10,610 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
 
Advertisement