ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నుమూత.. | MCA President Amol Kale Dies Of Cardiac Arrest In New York | Sakshi
Sakshi News home page

#Amol Kale: ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నుమూత..

Published Mon, Jun 10 2024 6:58 PM | Last Updated on Mon, Jun 10 2024 8:50 PM

MCA President Amol Kale Dies Of Cardiac Arrest In New York

ముంబై క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఎ) అధ్యక్షుడు అమోల్ కాలే  కన్ను మూశారు.  47 ఏళ్ల అమోల్‌ కాలే అమెరికాలోని న్యూయ‌ర్క్‌లో  గుండెపోటుతో మరణించారు.

రిపోర్ట్స్ ప్ర‌కారం.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో భాగంగా ఆదివారం న్యూయార్క్ వేదిక‌గా జ‌రిగిన  భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌ను అమోల్‌ కాలే ఎంసీఏ ఆఫీస్ బేరర్‌లతో క‌లిసి ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. అనంత‌రం హోట‌ల్ వెళ్లాక ఆయ‌న‌కు తీవ్ర‌మైన గుండెపోటు వ‌చ్చిన‌ట్లు ప‌లురిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

ఈ క్ర‌మంలో కాలేని ఆస్ప‌త్రికి తీసుకువెళ్లేలోపే తుది శ్వాస విడిచిన‌ట్లు తెలుస్తోంది. కాగా అక్టోబర్ 2022లో జరిగిన ముంబై అసోసియేషన్ ఎన్నికల్లో మాజీ భారత ఆటగాడు సందీప్ పాటిల్‌ను ఓడించి కాలే ఎంసీఎ అధ్యక్షునిగా ఎంపిక‌య్యారు. 

వ‌చ్చే దేశీవాళీ సీజ‌న్‌లో ముంబై సీనియర్ మెన్స్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను రెట్టింపు చేయడంలో ఆయనది కీలక పాత్ర.   కాలే ఆధ్వర్యంలోనే ముంబై 2023-24 సీజన్‌లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది. అమోల్ కాలే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement