నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు

Published Mon, Apr 1 2024 6:17 AM

Daily Horoscope: Rasi Phalalu On April 01 2024 In Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.సప్తమి సా.4.37 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: మూల రా.7.07 వరకు, తదుపరి పుర్వాషాఢ, వర్జ్యం: సా.5.33 నుండి 7.05 వరకు, తదుపరి తె.4.32 నుండి 6.04 వరకు,దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.17 వరకు, తదుపరి ప.2.57 నుండి 3.45 వరకు, అమృతఘడియలు: ప.12.41 నుండి 2.13 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.59, సూర్యాస్తమయం: 6.08. 

మేషం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.  ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికాభివృద్ధి. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: బంధువులతో సఖ్యత. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. పోటీపరీక్షల్లో విజయం. ధన, వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

సింహం: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి,వ్యాపారాలు అంతగా అనుకూలించవు.  అనారోగ్యం. సోదరులతో వివాదాలు.

తుల: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆకస్మిక ధనలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

వృశ్చికం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం.

ధనుస్సు: ఆకస్మిక ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

మకరం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.

కుంభం: కొత్త పనులు చేపడతారు. ఆర్థికాభివృద్ధి.  కీలక నిర్ణయాలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు.

మీనం: నూతన ఉద్యోగయోగం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

Advertisement
Advertisement