Weekly Horoscope in Telugu 20-08-2023 To 26-08-2023 - Sakshi
Sakshi News home page

వారఫలం: ఈరాశివారికి ఆర్థికంగా బాగుంటుంది.. ఎరుపు, నేరేడు రంగులు కలిసొస్తాయి

Published Sun, Aug 20 2023 6:57 AM

Weekly Horoscope Telugu 20 08 2023 To 26 08 2023 - Sakshi

వారఫలం.. 20.08.23 నుంచి 26.09.23 వరకు 12 రాశుల వారికి ఇలా..

మేషం
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. కొన్ని సమస్యలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన విద్యావకాశాలు లభించవచ్చు. ప్రముఖుల నుండి సహాయం పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు ఊహించని ఆహ్వానాలు రాగలవు. వారం ప్రారంభంలో  వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. పసుపు,  ఎరుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం
పనుల్లో  విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారు పరిచయమై సహాయపడతారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆస్తి వివాదాలు కొంతమేర తీరతాయి. గృహ నిర్మాణాలపై నిర్ణయాలు తీసుకుంటారు.  రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు కొన్ని  సమస్యలు తీరతాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు.  గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మిథునం
ఆర్థిక పరిస్థితి ప్రారంభంలో కొంత నిరాశ పరుస్తుంది. అయినా అవసరాలకు లోటు రాదు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. పాతమిత్రులను కలుసుకుని మరింత ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో ఊహించని పురోగతి ఉంటుంది. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. కళారంగం వారికి విశేష సన్మానాలు, విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, నేరేడు రంగులు,  నృసింహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం
ఆర్థిక లావాదేవీలు ఆశాజకనంగా ఉంటాయి. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం.  స్వల్ప అనారోగ్య సూచనలు. దూరపు బంధువుల రాకతో సంతోషం గడుపుతారు. ఒక వివాదం నుంచి బయటపడతారు. భూసంబంధిత లావాదేవీలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.  ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. పసుపు, నేరేడు రంగులు, హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

సింహం
కొన్ని సమస్యలు, వివాదాలు  మిత్రుల సహాయంతో పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనాలు భూములు కొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఎరుపు, లేత పసుపు రంగులు, విష్ణుధ్యానం చేయండి.

కన్య
కొత్త పనులు చేపట్టి  విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి కీలక సమాచారం. సంఘంలో గౌరవం పెరుగుతుంది.  శుభవర్తమానాలు అందుతాయి. నూతన వ్యక్తుల పరిచయం. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. మానసిక ఆందోళన. ధనవ్యయం. ఎరుపు, పసుపు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల
కొన్ని వివాదాలు నెలకొన్నా క్రమేపీ సర్దుకుంటాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆర్థిక పరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. నూతన∙వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి.  ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు రాగలదు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి..

వృశ్చికం
కొన్ని పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. విద్యార్థుల కృషి సఫలమవుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఆశించిన లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు. కళారంగం వారికి  నిరుత్సాహం. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు,  ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు
వారం మధ్యలో ఆర్థికంగా కలిసొస్తుంది. అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది. కుటుంబసభ్యుల ఆదరణ పొందుతారు. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. భూవివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. చాకచక్యంగా వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థుల యత్నాలు సఫలం. వాహనయోగం.  వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఎరుపు, నేరేడు రంగులు.  ఆంజనేయ దండకం పఠించండి.

మకరం
చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితులు, సోదరుల సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. ఇంట ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు రావచ్చు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో  దూరప్రయాణాలు. బ«ంధువులతో వివాదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠనం ఉత్తమం.

కుంభం
నిరుద్యోగులకు ఒక ప్రకటన మరింత ఉత్సాహాన్నిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులు, సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.  ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం. అనుకున్న సమయానికి నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. మిత్రులతో మాటపట్టింపులు. నీలం, పసుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం
కొన్ని పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు.కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వాహనసౌఖ్యం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయవర్గాలకు యత్నకార్యసిద్ధి. వారం మధ్యలో కొద్దిపాటి వివాదాలు. బంధువులతో వివాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement