ఓటు హక్కు అందరి బాధ్యత | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు అందరి బాధ్యత

Published Wed, May 8 2024 4:15 AM

ఓటు హ

సిరిసిల్ల: ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని స్వీప్‌ నోడల్‌ అధికారి, అదనపు డీఆర్‌డీవో గొట్టె శ్రీనివాస్‌ అన్నారు. జిల్లా సమాఖ్య ఆఫీస్‌లో మంగళవారం ఓటు వినియోగంపై స్వీప్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయడం అందరి బాధ్యత అన్నారు. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశాల మేరకు శ్రీఐ ఓటు ఫర్‌ ష్యూర్‌శ్రీ ఓటు హక్కు నా బాధ్యతశ్రీ అని ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కుపై విలేజీ ఆర్గనైజర్లకు, వీఓ ప్రెసిడెంట్లకు, వీఓఏలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం సుధారాణి, జిల్లా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

‘రైతుబంధు జమపై ఓర్వలేకపోతున్న బీజేపీ’

వేములవాడ: రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు నిధులను తమ ఖాతాలో జమ చేయడాన్ని బీజేపీ ఓర్వలేకపోతుందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే, ఆది శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతుభరోసాను రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమయానికి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందన్నారు. ఈసీ అస్త్రంగా చేసుకొని బీజేపీ రైతుల ఖాతాలో పడిన నిధులను ఆపేలా కుట్రలు చేసిందన్నారు. 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల రోజునే కేసీఆర్‌ రైతుబంధు డబ్బులు చేశారని తెలిపారు. అప్పుడు నోరుమెదపని బీజేపీ, ఆపని ఈసీ ఇప్పుడు ఎందుకు ఆపిందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం కృషి చేశామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రైతు వ్యతిరేక బీజేపీకి తగిన గుణపాఠం చెపుతామన్నారు.

ప్రజల పక్షాన బీఆర్‌ఎస్‌

గంభీరావుపేట: అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్‌ఎస్‌ ఎప్పటికీ ప్రజల పక్షమేనని టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు అన్నారు. మంగళవారం గంభీరావుపేటలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 23 ఏళ్లుగా బీఆర్‌ఎస్‌ పార్టీ కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రజలతో మమేకం అయ్యిందన్నారు. కేసీఆర్‌ చేపట్టిన బస్సు యాత్రతో కాంగ్రెస్‌ పార్టీలో గుబులు పుట్టిందన్నారు. వరినాట్ల సమయంలో ఇవ్వాల్సిన రైతుబంధును కోతలు పూర్తయ్యాక ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ అన్నారు. సమావేశంలో ఎంపీపీ వంగ కరుణ, జెడ్పీటీసీ విజయ, మండల, పట్టణ అధ్యక్షులు వెంకటస్వామి, వెంకట్‌, లక్ష్మణ్‌, సురేందర్‌రెడ్డి, లింగం, హరీశ్‌, రవి, రాజు పాల్గొన్నారు.

యారన్‌ సబ్సిడీ సాధనకు పోరాటం

సిరిసిల్లటౌన్‌: బతుకమ్మ చీరలు నేసిన కార్మికులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన యారన్‌ సబ్సిడీకై పోరాడుతామని పవర్‌లూమ్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్‌ అన్నారు. మంగళవారం సిరిసిల్లలోని పార్టీ ఆఫీస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్న నేపథ్యంలో సబ్సిడీ సాధనకు బుధవారం నెహ్రూనగర్‌లో కార్మికులతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యాచరణ చేపట్టి సబ్సిడీ డబ్బులు వచ్చే వరకు పోరాడుతామన్నారు. నాయకులు నక్క దేవదాసు, సిరిమల్ల సత్యం, గుండు రమేశ్‌, కంది మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి

సిరిసిల్ల: పార్లమెంట్‌ ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ ఆఫీసర్‌ లక్మీరాజం కోరారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి వేములవాడలోని నూతన లైబ్రరీ భవనం, సిరిసిల్ల గీతానగర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. బుధవారం ఆఖరి రోజు అని తెలిపారు.

ఓటు హక్కు అందరి బాధ్యత
1/2

ఓటు హక్కు అందరి బాధ్యత

ఓటు హక్కు అందరి బాధ్యత
2/2

ఓటు హక్కు అందరి బాధ్యత

Advertisement
Advertisement