హెచ్‌డీఎఫ్‌సీ విలీనంతో రుణ డిమాండ్‌ క్షీణత | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ విలీనంతో రుణ డిమాండ్‌ క్షీణత

Published Sat, Jul 8 2023 6:08 AM

HDFC merger will shrink mortgage-backed securities - Sakshi

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనంతో రుణ వితరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 300 బేసిస్‌ పాయింట్ల వరకు (3 శాతం) తగ్గి 13–13.5 శాతానికి పరిమితం కావొచ్చని కేర్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రుణాల్లో వృద్ధి 15.4 శాతంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. జూన్‌ 16 నాటికి ముగిసిన పక్షం రోజుల్లో రుణ వితరణ 15.4 శాతం పెరిగి ఈ ఏడాది రూ.140.2 లక్షల కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది.

ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు ఈ డిమాండ్‌ను నడిపించినట్టు చెప్పింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 13.2 శాతం వృద్ధి కంటే ఎక్కువ నమోదైంది. డిపాజిట్లు కూడా జూన్‌ 16తో ముగిసిన పక్షం రోజుల్లో 12.1 శాతం పెరిగాయి. రుణాలు, డిపాజిట్ల మధ్య అంతరం 337 బేసిస్‌ పాయింట్లుగా ఉంది. ఇక గడిచిన 12 నెలల్లో డిపాజిట్లు రూ.20 లక్షల కోట్లకు విస్తరించగా, రుణాలు రూ.18.7 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేర్‌ రేటింగ్స్‌ నివేదిక తెలిపింది.  

Advertisement
Advertisement