విదేశాల్లో ఓలా క్యాబ్స్‌ షట్‌డౌన్‌.. కారణం ఏంటంటే? | Sakshi
Sakshi News home page

విదేశాల్లో ఓలా క్యాబ్స్‌ షట్‌డౌన్‌.. కారణం ఏంటంటే?

Published Tue, Apr 9 2024 6:38 PM

Ola Cabs To Shut Down Operations In International Markets - Sakshi

ప్రముఖ దేశీయ రైడ్‌ షేరింగ్‌ దిగ్గజం ఓలా క్యాబ్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లలో తన సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ చివరి నాటికి అంతర్జాతీయ ఓలా క్యాబ్స్‌ సేవలకు స్వస్తి పలకనుంది. 

ఓలా క్యాబ్స్‌ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తన అంతర్జాతీయ యూజర్లకు నోటిఫికేషన్‌ పంపింది. సంస్థ 2018లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో తన సేవల్ని ప్రారంభించింది. 

అంతర్జాతీయ మార్కెట్‌కు ఓలా గుడ్‌బై
కాగా, తమ దేశంలో ఓలా సేవలను మూసివేయడంపై ఆస్ట్రేలియన్ మీడియా గతంలోనే అనేక కథనాలు ప్రచురించింది. మీడియా సంస్థ ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ డ్రైవర్‌లకు ఓలా పంపిన ఇమెయిల్‌ను ఉదహరించింది. ఏప్రిల్ 12 నుండి అన్ని సంబంధిత లేబుల్‌లను తీసివేయమని, దాని పర్మిట్‌ల కింద బుకింగ్‌లు తీసుకోవడం ఆపివేయమని కోరింది. అదే తేదీ నుండి సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు కస్టమర్‌లకు పంపిన ఇమెయిల్‌ను న్యూస్‌.కామ్‌.ఏయూ అనే మీడియా సంస్థ హైలెట్‌ చేసింది.

కారణం ఇదేనా
క్యాబ్‌ ఇంధన వాహనాల్ని ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చాలంటూ ఆయా దేశాల ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తున్నాయి. క్యాబ్స్‌ను ఈవీలుగా మార్చాలంటే ఖర్చుతో కూడుకున్న పని. పెట్టుబడి కూడా భారీ మొత్తంలో పెట్టాలి. పైగా న్యూజిల్యాండ్‌, ఆస్ట్రేలియాల్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ తరుణంలో ఓలా క్యాబ్స్‌ ఈ నిర్ణయం తీసుకుంది.భారత్‌లో విస్తరణకు మరింత అవకాశం ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓలా ప్రతినిధులు చెబుతున్నారు.    

Advertisement
 
Advertisement
 
Advertisement