‘ఎడారిలో ఒయాసిస్సు’ లా, ఐటీ ఉద్యోగులకు టీసీఎస్ బంపరాఫర్! | Sakshi
Sakshi News home page

‘ఎడారిలో ఒయాసిస్సు’ లా, ఐటీ ఉద్యోగులకు టీసీఎస్ బంపరాఫర్!

Published Wed, Feb 21 2024 1:13 PM

TCS chief executive K Krithivasan says no cutting down on hiring - Sakshi

ఆర్ధిక మాద్యం, ప్రాజెక్ట్ ల కొరత, చాపకింద నీరులా అన్నీ రంగాల్లో మనుషుల స్థానాన్ని కృతిమమేధతో భ‌ర్తీ చేయ‌డం వంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల నేప‌థ్యంలో టెక్నాల‌జీ సంస్థ‌లు కొత్త ఉద్యోగాల నియామ‌కాల్ని త‌గ్గించాయి. ఈ త‌రుణంలో ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం టీసీఎస్ హైరింగ్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

టీసీఎస్ నియామకాల్ని తగ్గిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆ సంస్థ సీఈఓ కే.కృత్తివాసన్ స్పందించారు.మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ఉద్యోగుల నియమాకం ఉంటుందని తెలిపారు.

సంస్థ పనితీరు బాగుంది. ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో ఉంది. సంస్థకు వచ్చే ప్రాజెక్ట్ల పరంగా ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం. వాస్తవానికి, మా నియామక ప్రణాళికలను తగ్గించడానికి మాకు ఎటువంటి ప్రణాళిక లేదు. చెప్పినట్లుగానే నియామకాన్ని కొనసాగిస్తాము అని సీఈఓ స్పష్టం చేశారు.  

జాబ్ ఆఫర్ లెటర్లను వెనక్కి
పలు దేశాల్లో ఐటీ మార్కెట్లో ఒడిదడుకులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇప్పటికే క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిపి.. ఇచ్చిన జాబ్ ఆఫర్ లెటర్లను వెనక్కి తీసుకుంటున్నారని నివేదికల మధ్య టీసీఎస్ ఈ ప్రకటన వచ్చింది. 

నాస్కామ్ నివేదిక ప్రకారం.. 
2023-24లో పరిశ్రమ కేవలం 60వేల కొత్త ఉద్యోగా అవకాశాలు కల్పించాయని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 5.43 మిలియన్లకు చేరుకుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM)గత వారం తెలిపింది.

ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే
ఇక వర్క్ ఫ్రమ్ హోంలో ఉద్యోగుల్ని కార్యాలయాలకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంపై కృతివాసన్ స్పందించారు. ఆఫీస్ నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగులు కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కానీ ఇంటి నుంచి, లేదంటే వారానికి మూడు రోజులు ఆఫీస్ కు రావడం వల్ల వ్యక్తిగతంగా ఉద్యోగులకు, సంస్థలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని నేను నమ్ముతున్నాను. ఒక సంస్థగా మేం ఉద్యోగులకు సహాకారం, స్నేహానికి విలువ ఇస్తాం. ఇదంతా ఆన్లైన్ లేదంటే జూమ్ కాల్ ద్వారా సాధ్యం కాదు. సీనియర్ల ఎలా పనిచేస్తున్నారో ఇంటి వద్ద నుంచి పనిచేసే వారికి ఏం తెలుస్తోంది? అని ప్రశ్నించారు. అంతేకాదు వర్క్ ఫ్రమ్ హోం కంటే ఆఫీస్ కి వచ్చి పనిచేయడమే సరైన మార్గమని విశ్వసిస్తున్నట్లు టీసీఎస్ సీఈఓ కృతివాసన్ తెలిపారు.   

Advertisement
Advertisement