హరితయానం.. | Sakshi
Sakshi News home page

హరితయానం..

Published Fri, May 10 2024 10:30 PM

హరితయానం..

జగనన్న హరిత నగరాల్లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రహదారుల సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జాతీయ రహదారి మొత్తం 17,761మీటర్ల పొడవున, 18 రహదారుల డివైడర్లను హరిత హారాలుగా తయారు చేశారు. నగరంలో 16 పార్కులను అభివృద్ధి చేశారు. ఎయిర్‌పోర్టు కారిడార్‌ను రూ.17కోట్లతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. కాలువల్లో ఎన్నో ఏళ్లుగా పూడుకపోయిన చెత్తను తొలగించారు. మిషన్‌ క్లీన్‌ కృష్ణా కింద నదీ తీరాన్ని శుభ్రం చేశారు. నగరంలోని ప్రధాన కాలువల్లో బోటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. విజయవాడ నగరంలో అంతర్గత రహదారులకు పెద్ద పీట వేశారు. గత కొన్నేళ్లు క్రితం నగరంలో నీటి సరఫరా కోసం వేసిన పైపుల లైన్లు తుప్పు పట్టి దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్త పైపు లైన్లను వేశారు. కొండ ప్రాంతాల్లో నీటి సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చారు.

Advertisement
 
Advertisement