బాబోయ్ బంగారం.. ఇలాగైతే గోల్డ్ కొనడం కష్టమే! | Sakshi
Sakshi News home page

Gold and Silver Price: బాబోయ్ బంగారం.. ఇలాగైతే గోల్డ్ కొనడం కష్టమే!

Published Mon, Apr 1 2024 6:38 PM

Today Gold and Silver Price 2024 April 1 - Sakshi

బంగారం ధరలు తారా జువ్వ లాగా పైపైకి చేరుతున్నాయి. 2024 ప్రారంభంలో కొంత తగ్గుముఖం పట్టిన బంగారం రేటు ఏప్రిల్ ప్రారంభంలో ఏకంగా రూ. 70వేలుకు చేరువయ్యింది. నేటి (ఏప్రిల్ 1) పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

హైదరాబాద్‌, విజయవాడలలో మాత్రమే కాకుండా నేడు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.63750 (22 క్యారెట్స్), రూ.69530 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ రూ. 850, రూ. 930 పెరిగింది.

చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 850 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 930 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 63750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 69530 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 63750  రూపాయలు.. 24 క్యారెట్ల ధర 69530 రూపాయలకు చేరింది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు రూ. 850, రూ. 930 పెరిగింది.

వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 1) వెండి ధర రూ. 600 పెరిగి రూ. 78600 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement