నార్సింగీ హిట్‌ అండ్‌ రన్‌ కేసుపై అనుమానాలు | Sakshi
Sakshi News home page

నార్సింగీలో మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు.. ఆర్మీ సైనికుడి మృతి

Published Mon, Mar 4 2024 5:09 PM

Another Hit And Run Case in Narsingi ORR - Sakshi

సాక్షి, రంగారెడ్డి: నార్సింగీలో సోమవారం మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు చోటుచేసుకుంది. ఔటర్ రింగు రోడ్డుపై రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.  దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయినా వాహనం ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓఆర్‌ఆర్‌పై ప్రమాద సమయంలో ఎంట్రీ, ఎగ్జిట్‌ అయిన వాహనాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. యువకుడిని ఢీకొట్టి పరారైంది రెడీ మిక్సర్‌ వాహనంగా పోలీసులు గుర్తించారు.

పోలీసుల అనుమానం..
రోడ్డు ప్రమాదంలో మృతుడిని ఆర్మీ సైనికుడిగా గుర్తించారు. గోల్కొండ ఆర్టలరీ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న జవాన్‌ కులాన్‌గా గుర్తించారు. హింట్ అండ్ రన్ కేసులో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడు అసలు ఔటర్ రింగ్ రోడ్ వైపు ఎందుకు వచ్చాడు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్మీ జవాన్లు ప్రమాద స్థలానికి భారీగా చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement