HYD: పక్కనే బాయ్స్ హాస్టల్.. బాత్రూంలో ఉండగా వీడియో తీసి..
Published
Sun, Jun 18 2023 12:11 PM
అమీర్‌పేట(హైదరాబాద్): మహిళ బాత్రూంలో ఉండగా వీడియో తీసిన యువకుడిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం జనగాంలో అత్తగారింట్లో ఉండే ఓ గృహిణి ఎస్ఆర్నగర్ చిన్న గురుద్వారా వద్ద ఉండే తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.
శనివారం మధ్నాహ్నం ఆమె బాత్రూంకు వెళ్లగా.. పక్కనే శ్రీదేవి బాయ్స్ హాస్టలో ఉండే కిరణ్ అనే యువకుడు టెర్రస్‌పైకి ఎక్కి ఎగ్జాస్ట్ ఫ్యాను వద్ద సెల్ పెట్టి వీడియో తీశాడు. దీనిని గమనించిన మహిళ చుట్టు పక్కన ఉండే వారిని అప్రమత్తం చేయడంతో యువకుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి:బంజారాహిల్స్: మసాజ్ చేస్తూ గొలుసు కొట్టేశారు..